Acting Institute director Vinay Varma arrested కటకటాల వెనక్కి ‘సూత్రధార్’ వినయ్ వర్మ

Sutradhar acting institute director vinay varma arrested under nirbhaya act

young theater trainee files complaint trainer, Theatre trainer, Vinay Varma, Narayanguda, sutradhar acting institite, Himayatnagar taluka, bharosa, publicity stunt, latest movie news, tollywood, movies, entertainment

Veteran theatre actor, Sutradhar acting academy director Vinay Varma had been arrested by Narayanguda police and produced in Nampally court, after a female student of his acting workshop has made sexual harassment allegation on him.

కటకటాల వెనక్కి ‘సూత్రధార్’ వినయ్ వర్మ

Posted: 04/23/2019 08:47 PM IST
Sutradhar acting institute director vinay varma arrested under nirbhaya act

తమ దగ్గర నటన నేర్చుకోవాలంటే బట్టలు విప్పేయాల్సిందేనంటూ తొమ్మిది మంది యువతులతో అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో సూత్రధార్‌ యాక్టింగ్ స్కూల్ యజమాని వినయ్ వర్మను నారాయణగూడ పోలీసులు అరెస్టు చేసి న్యాయస్థానం ముందు నిలిబెట్టారు. నటన నేర్చుకోవడానికి వెళ్తే బట్టలు విప్పేయమన్నారంటూ ఓ బాధితురాలు ఈ నెల 17న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారం రోజులుగా మీనమేషాలు లెక్కబెట్టిన పోలీసులు.. ఎట్టకేలకు అరెస్టు చేశారు.

పోలీసులు జాప్యం చేస్తున్న క్రమంలో అమె మీడియా ముందుకు రాడంతో విషయం ఒక్కసారిగా సంచలనంగా మారింది. దీంతో గతవారం రోజులుగా విచారణ చేసిన పోలీసులు ఇవాళ వినయ్ వర్మను అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపర్చారు. దీంతో న్యాయస్థానం నిందితుడ్ని జ్యూడిషియల్ రిమాండ్ కు తరలింది. నటన నేర్చుకోవాలంటే బట్టలు విప్పాలంటూ ఇప్పటి వరకు 9 మంది యువతులతో వినయ్‌ వర్మ అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆరోపణలున్నాయి. ఇక వినయ్ వర్మపై సెక్షన్ 354 A(నిర్భయ యాక్ట్) 506, 509 ఐపీసీ కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.
 
అసలేం జరిగిందంటే..

హైదరాబాద్ నారాయణగూడలో వినయ్ వర్మ సూత్రధార్ యాక్టింగ్ ఇనిస్టిట్యూట్‌‌ను నడుపుతున్నాడు. కొద్ది రోజుల క్రితమే బాధిత యువతితో పాటూ సహా మరో ఎనిమిదిమంది నటన నేర్చుకునేందుకు చేరారు. ప్రతి రోజు ఉదయం 6.30 నిమిషాల నుంచి 9.30 వరకు క్లాస్ జరుగుతోంది. వారం క్రితం బాధిత యువతి క్లాస్‌కు వెళ్లింది. ఆమెతో పాటూ మిగిలిన ఎనిమిదిమంది రూమ్‌లోకి వెళ్లగానే వినయ్ వర్మ తలుపులు, కిటికీలు మూసేయమని చెప్పాడట.

గదిలో ఉన్న అందర్ని బట్టలు విప్పమని వినయ్ వర్మ చెప్పాడు. అతడి మాటలతో షాక్ తిన్న కొందరు యువతులు అందుకు ఒప్పుకోలేదట. వెంటనే వినయ్ వర్మ యువతిని తిట్టి బయటకు పంపించాడట. వారిలో ఓ యువతి మాత్రం వర్మ చెప్పినట్లు బట్టలు తీసేసినట్లు బాధిత యువతి చెప్పుకొచ్చింది. వెంటనే తాను ఈ వేధింపుల విషయాన్ని.. షీ టీమ్‌ దృష్టికి తీసుకెళ్లానని.. ఏసీపీ నర్మద సలహాతో నారాయణగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పుకొచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vinay varma  sutradhari  acting school  narayanaguda  publicity stunt  tollywood  Crime  

Other Articles