స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపోందిన బాహుబలి చిత్రాలు భారతీయ సినీ చరిత్రను తిరగరాయడంతో వివిధ బాషల్లో కూడా చారిత్రక నేపథ్య చిత్రాలు రూపోందిచారు దర్శకులు. అయితే తన మార్కు దర్శకత్వానికి ఓ పేరు వున్న ప్రముఖ దర్శకుడు మణిరత్నం కూడా తాజాగా చారిత్రక నేపథ్య చిత్రాన్ని రూపోందించే పనిలో నిమగ్నమయ్యారు. పొన్నియన్ సెల్వన్ అనే నవల ఆధారంగా రూపోందుతున్న ఈ హిస్టారికల్ మూవీలో నటించేందుకు ఇప్పటికే భారీ తారాగణాన్ని కూడా ఫైనల్ చేశాడు దర్శకుడు.
అయితే మణిరత్నం చిత్రాల పేరు వినగానే ఆ చిత్రంలో తనకు అవకాశం వస్తే బాగుండని పలువరు సినీకళాకారులకు అనిపించడం కూడా సహజం. అయితే ఇప్పటికే ఆయన దర్శకత్వంలో పలు చిత్రాల్లో నటించడం మాట అటుంచితే.. ఏకంగా హీరోయిన్ గా కూడా మెరిసిన అందాల అమ్మడు.. మరోసారి ఆయన దర్శకత్వంలో ఓ ముఖ్యభూమికలో కనిపించాలన్న కోరిక కలిగిందట. అమె ఎవరో కాదు మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్. ఈ చిత్రంతో మళ్లి చిత్రరంగంలోకి రీ-ఎంట్రీ ఇవ్వాలని అమె భావిస్తున్నారు.
చోళ రాజుల కాలంలో నడిచే కథతో మణిరత్నం తన కొత్త చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. పొన్నియన్ సెల్వన్ అనే నవల ఆధారంగా ఈ కథను మణిరత్నం రూపొందించారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, జయం రవి, అనుష్క, కీర్తి సురేష్ నటించనున్నారు. ఈ చిత్రంలో ఐశ్వర్యారాయ్ కూడా ఓ కీలక పాత్రను పోషించబోతోంది. అందులోనూ అందాల అమ్మడుగా ఇన్నాళ్లు వెండితెరపై మెరిసిన అమె.. ఇక ఈ చారిత్రక చిత్రంలో ప్రతినాయకురాలిలా (విలన్ క్యారక్టర్) కనిపించనుంది. ఈ పాత్రే కథను కీలక మలుపు తిప్పుతుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మద్రాస్ టాకీస్, రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more