హీరోయిన్ రాశీఖన్నా ఓ డబ్బింగ్ ఆర్టిస్టును స్టార్ గా మలిచారు. స్టార్ అంటే సినిమాల్లో స్టార్ గా కాకపోయినా.. ఇక్కడ ఇద్దరి మంచితనంతో ఇద్దరూ మనస్సున్న మనషులుగా, స్పందించే హృదయాలున్నవారిగా గుర్తింపుసొందారు, మరి స్టార్ ఎందుకని అన్నామంటే.. కేవలం తెర వెనుక మాత్రమే వుండే మనిషిని రాశీఖన్నా సారీతో తెరముందుకు తీసుకువచ్చింది. అమె కోసం, అమె ఫోటోల కోసం సర్చ్ ఇంజన్ గూగుల్ లో అటు తమిళ, ఇటు తెలుగు, వీరితో పాటు మలయాళ, కన్నడ సినీ అభిమానులు కూడా వెతికేస్తూన్నారట. అందుకని అమె నెట్టింట్లో స్టార్ అయ్యారు.
ఇంతకీ మ్యాటర్ ఏంటీ అంటారా.? రాశీఖన్నా ఇటీవలే ‘అయోగ్య’ అనే సినిమాలో నటించారు. ఎన్టీఆర్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన టెంపర్ చిత్రానికి రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రానికి మురుగదాస్ శిష్యుడు వెంకట్ మోహన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో విశాల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించి అలరించాడు. రీసెంట్గా విడుదలైన ఈ సినిమా తమిళంలోనూ మంచి టాక్‌తో దూసుకుపోతోంది. అయితే ఈ చిత్రంలో రాశీకి రవీనా అనే యువతి డబ్బింగ్ చెప్పారు. సినిమా క్రెడిట్స్‌లో తన పేరును చేర్చకపోవడంతో ట్విటర్ వేదికగా రవీనా తన బాధను వ్యక్తపరిచారు.
అయితే.. ఈ సినిమా పూర్తయ్యాక వచ్చే ఎండ్ టైటిల్స్‌లో వాయిస్ ఆర్టిస్టులకు క్రెడిట్స్ ఇవ్వలేదు. దీనిపై డబ్బింగ్ ఆర్టిస్ట్ రవీనా తన ట్విట్టర్ ద్వారా ఆవేదన వ్యక్తం చేసింది. సినిమా టైటిల్స్‌లో మా కేటగిరీకి క్రెడిట్స్ ఇవ్వకపోవడం చాలా బాధ కలిగిస్తోందని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌పై స్పందించిన రాశీ ఖన్నా.. నన్ను క్షమించు రవీనా.. స్క్రీన్ మీద నన్ను ఎలివేట్ చేయడానికి నీ అందమైన గొంతు ఇచ్చిన మీకు ప్రత్యేక కృతజ్ఞతలు అని పేర్కొంది. ఇందుకు రవీనా స్పందించి.. ఇది మీ తప్పు కాదు. మీకు డబ్బింగ్ చెప్పినందుకు సంతోషంగా ఉంది’ అని రీట్వీట్ చేశారు.
I am sorry @raveena116 .. but I want to thank you for lending your beautiful voice to me and enhancing my act on screen. Lots of love to you and way to go https://t.co/SLcdMGWZeF
— Raashi Khanna (@RaashiKhanna) May 16, 2019
Thankyou so much love and pls, do not apologize.. Not ur mistake at all.. thanks again n I’m glad I could work for u https://t.co/6gsfdqlAIw
— Raveena.S.R (@raveena116) May 16, 2019
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more