అక్కినేని యువవారసుడిగా చిత్రరంగంలోకి అడుగుపెట్టి ఇప్పటికే రెండు చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చినా.. అవి ఆశించినంతగా బాక్సాఫిసు వద్ద సందడి చేయకపోవడంతో.. తనకు ఒక చక్కని బ్రేక్ కావాలని వేచిచూస్తున్న హీరో అక్కినేని అఖిల్. ఇదే పరిస్థితులను ఎదుర్కొన్న అక్కినేని నాగ చైతన్యను గీతా అర్ట్స్ బ్యానర్ లో నిర్మించిన ‘100% లవ్’ చిత్రం మంచి సక్సెస్ ను అందించింది. తాజాగా మజిలి చిత్రం నాగచైతన్య కెరీర్ లోనే ది బెస్ట్ చిత్రంగా మారింది.
ఇక దీంతో అక్కినేని అఖిల్ కూడా మంచి సక్సెస్ అందించేందుకు గీతా అర్ట్స్ 2 బ్యానర్ రెడీ అవుతోంది. ఇందులో భాగంగా రూపోందుతున్న తాజా చిత్రం ఇవాళే సెట్స్ పైకి వెళ్లింది.
'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందనే టాక్ చాలా రోజులుగా వినిపిస్తోంది. ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని అభిమానులంతా ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తుండా.. ఆ శుభతరుణం, శుభసమయం, శుభముహూర్తం రానే వచ్చింది. హైదరాబాద్ - ఫిల్మ్ నగర్లోని 'దైవసన్నిధానం'లో కొంత సేపటి క్రితం ఈ చిత్రం పూజా కార్యక్రమాలను జరుపుకుంది.
గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీవాసు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. నాగార్జున - అమలతో పాటు దర్శక నిర్మాతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గోపీసుందర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ షూటింగ్ మొదలుకానుంది. ఈ షెడ్యూల్ పూర్తయ్యేలోగా కథానాయికల ఎంపిక జరగనుందని అంటున్నారు. అఖిల్ చేసిన మూడు సినిమాలు అభిమానులను నిరాశ పరిచాయి. అందువలన వాళ్లంతా ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు.
Allu Aravind presents @AkhilAkkineni8 's #Akhil4 #GA2 Production no 5 Launched Today!
— Geetha Arts (@GeethaArts) May 24, 2019
Directed by #BommarilluBhaskar
Music by #GopiSunder
Cinematography by #VManikandan
Produced by #BunnyVas & #VasuVarma Under @GA2Official pic.twitter.com/l46lIF9Nt7
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more