Pooja Hegde's will be a surprise: Harish వరుణ్ తేజ్ ‘వాల్మీకి’లో శ్రీదేవిలా పూజాహెగ్డే మెరుపులు

Varun tej excelled in the role beyond expectations harish shankar

pooja hegde, varun tej, valmiki, varun tej valmiki trailer, valmiki, valmiki teaser, valmiki movie teaser, varun tej valmiki movie, valmiki movie, varun tej valmiki movie launch, valmiki telugu movie, pooja hegde valmiki, valmiki pre teaser, varun tej latest movie, Harish shanker, micky j mayor, tollywood, movies, entertainment

Director Harish recently in an interview revealed about Pooja Hegde's role in Varun Tej starrer Valmiki and assured it to be a complete surprise.

వరుణ్ తేజ్ ‘వాల్మీకి’లో శ్రీదేవిలా పూజాహెగ్డే మెరుపులు

Posted: 09/17/2019 12:31 PM IST
Varun tej excelled in the role beyond expectations harish shankar

వరుణ్ తేజ్..  హరీష్ శంకర్ కాంబినేషన్‌లో 'వాల్మీకి' చిత్రం వస్తున్న విషయం తెలిసిందే. ఆ మధ్య రిలీజైన టీజర్‌, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. గద్దలకొండ గణేష్‌కు జోడిగా శ్రీదేవిగా అలరించనుంది పూజా.. ఈ ఇద్దరి మధ్య రోమాన్స్ కొత్తగా ఉంటుందని టాక్. అంతేకాదు అప్పట్లో అతిలోక సుందరి శ్రీదేవి, శోభన్ బాబు, జయ ప్రద నటించిన 'దేవత' చిత్రం  హిట్ సాంగ్‌ 'ఎల్లువొచ్చి గోదారమ్మ వెల్లాకిల్లా పడ్డాదమ్మో' పాటను మరోసారి హరీశ్‌ శంకర్‌ తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చూపించే ప్రయత్నం చేశారంట. ఈ పాట  కోసం  ప్రత్యేకంగా తమిళనాడులో 1200 బిందెలు తయారు చేయించారట.

దర్శకుడు హరీష్‌శంకర్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఈ సినిమాలో పూజా హెగ్డే  శ్రీదేవిగా అదరగొట్టనుందని.. ఆమె క్యారెక్టరైజెషన్‌ గానీ, 'ఎల్లువొచ్చి గోదారమ్మ వెల్లాకిల్లా పడ్డాదమ్మో' సాంగ్‌ గానీ.. కథ డిమాండ్‌ మేరకే పెట్టాం... అన్నారు. కథలో భాగంగా ఆ పాట అవసరం అనిపించిదని.. ఏదో కమర్షియల్‌గా ఒక రీమిక్స్‌ పాట పెట్టాలని కాదన్నారు. పాత పాటల్నే పెట్టాలంటే.. చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌ గారి పాటలు బోలెడు ఉన్నాయన్నారు.

మరో ప్రశ్నకు సమాధానంగా ఖచ్చితంగా పవన్‌తో సినిమా వుంటుంది. ఫ్యాన్స్‌తో పాటు మీరు కూడా సినిమా త్వరగా జరగాలని కోరుకోండి. నేను కూడా పవన్‌ కళ్యాణ్‌గారితో సినిమా ఎప్పుడెప్పుడు చేయాలా? అని ఎదురు చూస్తున్నాను.. ఆయన ఎప్పుడంటే అప్పుడే అన్నారు హరీష్. ఇక వాల్మీకి అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకొని సెప్టెంబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరందుకున్నాయి.

'వాల్మీకి' తమిళంలో సూపర్ హిట్టైనా.. 'జిగర్తాండ' సినిమాకు తెలుగు రీమేక్‌గా వస్తోంది. అక్కడ బాబీ సింహ నటించిన పాత్రలో వరుణ్ తేజ్ నటిస్తుండగా.. ఆ సినిమాలో బాబీసింహకు హీరోయిన్ గానీ, పాటలు లేవు.. అయితే కొన్ని మార్పులు చేసి.. వరుణ్ క్యారెక్టర్ డిజైన్ చేసినట్లు చెబుతున్నారు దర్శకుడు. జిగర్తాండలో సిద్ధార్థ్ చేసిన పాత్రను తమిళ నటుడు అధర్వ చేస్తున్నాడు. మిక్కీ జే. మేయర్‌ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. రామ్‌ ఆచంట, గోపీ ఆచంట.. 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై  నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 20న సినిమా విడుదలౌతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Varun tej  valmiki  Harish shanker  pooja hegde  Sridevi  micky j mayor  tollywood  

Other Articles