Pink to be remade in Telugu with Pawan Kalyan అఫిషియల్: పవన్ కల్యాణ్ రీ-ఎంట్రీ కన్ఫామ్

Pawan kalyan to star in the telugu remake of amitabh and taapsee starrer pink

Boney Kapoor, Dil Raju, Nerkonda Paarvai, Pawan Kalyan, Pink, Film trade analyst, Taran Adarsh, Telugu remake. Tollywood, movies, Entertainment

Boney Kapoor's Tamil remake of Shoojit Sircar's Pink, the producer is set to collaborate with Dil Raju on the film's Telugu remake. The yet-untitled project will be helmed by Sriram Venu and will feature Pawan Kalyan. Film trade analyst Taran Adarsh made the announcement on social media.

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు తరుణ్ ఆదర్శ్ గుడ్ న్యూస్..

Posted: 11/02/2019 04:59 PM IST
Pawan kalyan to star in the telugu remake of amitabh and taapsee starrer pink

చిత్ర పరిశ్రమకు సాదారణంగా నటులు దూరం కావాలని అనుకోరు. ఒకవేళ అలా దూరం అయితే ఇక వారిని అభిమానులు కూడా క్రమంగా మర్చిపోతారు. అయితే మెగా ఫ్యామిలీ మాత్రం అందుకు మినహాయింపు వుందన్నది కాదనలేని సత్యం. మెగాస్టార్ చిరంజీవి ఏకంగా పదేళ్ల పాలు చిత్ర పరిశ్రమకు దూరమైనా.. తన రీ ఎంట్రీతో అభిమానులను అక్కున చేర్చుకుని.. వారి మనస్సులలో సైరాతో చెరిగిపోని ముద్రవేసుకున్నాడు. దీంతో అన్న బాటలోనే తమ్ముడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా పయనిస్తున్నాడు.

రాజకీయాల నేపథ్యంలో సినిమాలకు దూరంగా ఉన్న జనసేనాని పవన్ కల్యాణ్... అన్నయ్య చిరంజీవి బాటనే ఫాలో అవుతున్నాడు. త్వరలోనే కొత్త సినిమా చేయబోతున్నారంటూ ప్రచారం జోరందుకుంది. అయితే ఇలాంటి వార్తలను కొందరు పవన్ ఫ్యాన్స్ నమ్మడం లేదు. ప్రజల కోసం, ప్రజా సేవ కోసం.. సినిమాలకు దూరంగా వుంటానని చెప్పిన ఆయన.. సినిమాలు చేయడం లేదని వాదిస్తున్నారు. కాగా మరికొందరు మాత్రం పవన్ సినిమా చేస్తున్నారని అంటున్నారు. సినిమా కూడా ఓక మాద్యమం అని పేర్కోన్నారు. దిల్ రాజుకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వైరల్ అయ్యాయి.

అయితే ఈ వార్తల్లో ముమ్మాటికీ నిజముందని పవన్ అభిమానులకు బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ గుడ్ న్యూస్ చెప్పారు. పవన్ కల్యాణ్ సినిమా తెరకెక్కబోతున్నట్టు ఆయన అధికారికంగా ప్రకటించారు. 'బిగ్ న్యూస్. తమిళంలో బాలీవుడ్ సినిమా 'పింక్'ను రీమేక్ చేసిన బోనీ కపూర్... ఇప్పుడు దిల్ రాజుతో చేతులు కలపారు. 'పింక్'ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించబోతున్నారు. 'అజ్ఞాతవాసి' తర్వాత పవన్ నటిస్తున్న సినిమా ఇదే' అంటూ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. తరణ్ చేసిన ట్వీట్ తో పవన్ అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles