‘సైరా నరసింహారెడ్డి’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి.. కొరటాల శివ దర్శకత్వంలో తన 152వ ప్రాజెక్టుకు కొబ్బరికాయ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మెగా అభిమానులకు దర్శకుడు కొరటాల శివ డబుల్ జోష్ ను అందించేందుకు రెడీ అవుతున్నాడు. అదేనండీ ఈ చిత్రంలోనూ చిరంజీవి ద్విపాత్రాభినయంతో అభిమానులను అలరించనున్నాడు. శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో ఆలయానికి వచ్చే నిధులు, విరాళాల కుంభకోణానికి సంబంధించిన చక్కని సందేశాత్మకంగా చిత్రాన్ని రూపోందించేందుకు త్వరలో శ్రీకారం చుట్టనున్నారు.
ఇక ఈ చిత్రంలో ద్విపాత్రాభినయంతో అభిమానులను మెప్పించే చిరంజీవి మాజీ మావోయిస్టుగానే కాకుండా మావో భావజాలంతో సంఘ సంస్కర్తగా కూడా కనిపించనున్నారు. ఈ చిత్రంలో సింహాచల వరహా లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో జరిగిన యధార్థఘటనలను జోడించి కథగా రూపొందించనున్నారని టాక్. ఈ చిత్రంలో చిరంజీవి గోవింద, ఆచార్య రెండు ప్రాతలలో నటించనున్నారు. ఇక ఆయన పక్కన త్రిష హీరోయిన్ గా నటించనున్నారు.
ప్రీ ప్రొడక్షన్ పనులు ముగించుకున్న ఈ చిత్రం వచ్చే నెల నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. వేసవి సెలవులను పురస్కరించుకుని ఏప్రిల్ చివరి వారంలో ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ ను రోటీన్ కు భిన్నంగా పాటతో మొదలు పెట్టనున్నట్టు సమాచారం. మరో హీరోయిన్ ను చిత్ర యూనిట్ ఎంపిక చేసే పనిలో వుంది. ఈ చిత్రానికి అజయ్ అటుల్ సంగీతాన్ని సమకూర్చనున్నారు. మెగా వపర్ స్టార్ రాంచరణ్ తేజ్ కొణిదెల ప్రోడక్షన్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more