Telugu industry supports the favouritism.. తెలుగు ఇండస్ట్రీ లో వారసుల హావ..

Telugu industry supports the favouritism fav actors

Telugu industry, Actors children, Mahesh Babu, Allu Arjun, Jr NTR, Tollywood

The tollywood film industry supports the favouritism which means the top actors children of the telugu industry are acting in the films.

తెలుగు ఇండస్ట్రీ లో వారసుల హావ..

Posted: 11/16/2019 01:10 PM IST
Telugu industry supports the favouritism fav actors

తరతరాల వంశ వారసులకు మన తెలుగు ప్రజలు మన తెలుగు ఇండస్ట్రీ స్వాగతం పలుకుతుంది.. ఈ మధ్య కాలం లో వారసుల హావ బాగా నడుస్తుంది.. తండ్రి తర్వాత కొడుకు , కొడుకు తర్వాత అతని కొడుకు ఇలా వంశపార్యంగా కొనసాగుతుంది .. . ఈ నవీన యుగంలో మేము ఏమి తక్కువ కాము అని కొడుకులతో పాటు కుమార్తెలు కూడా సినీ రంగ ప్రవేశం చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.. .. తండ్రి చాటు బిడ్డలు .. అసలే తండ్రుల గారాల తనయులు ఇక వారి సినీ రంగ ప్రస్థానానాన్నికి ఎంత ఆలోచనలు చేస్తారు..

మెగాస్టార్ కుటుంబము నుండి వచ్చి మన్నల్ని ఎంతగానో స్టైలిష్ గా అలరించిన అల్లు అరవింద్ తనయుడు “ అల్లుఅర్జున్ “ గారి తనయులు అర్హ, అయాన్ ఈ మధ్య జరిగిన “ అలా వైకుంఠపురంలో “ చిత్రానికి సంబదించిన ఒక పాట ఓం డాడీ సాంగ్ టీజర్ లో భాగంగా పాల్గొని తమ చూడచక్కని హావభావాలతో తెగ సందడి చేసారు ఈ పిల్లలా సందడి పులువురిని ఆకర్షించింది..

సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా మనకు దర్శనమిచ్చిన మన రాజకుమారుడు ఇప్పటికి అమ్మాయిలా గుండెలలో కొలువై ఉన్నారు.. అయన పిల్లల సందడి కూడా అంత ఇంత కాదు.. ఇప్పటికే ఆయన కుమారుడు గౌతమ్ “ 1 నేనొక్కడినే “ చిత్రం లో చిన్ననాటి మహేష్ గా మెరిసి మనకు దగ్గర అయ్యాడు.. ఇప్పుడు సితార వంతు వచ్చింది..తన ముద్దు ముద్దు మాటలతో మనల్ని ఎంత గానో అబ్బురపరిచే ఈ చిన్నారి.. “ ఫ్రోజెన్ 2 “ చిత్రంలో చిన్నారి ఎల్సా కు తన గొంతు అరువు ఇచ్చింది..

కృష్ణ గారి కుటుంబం నుండే వచ్చిన మన స్టార్ హీరో సుధీర్ బాబు తన నటనతో ఇప్పటికే మన మన్ననలు పొందుతున్నారు .అయన పిల్లలు కూడా సినీ రంగం లో తమ ప్రతిభను కనబరుస్తున్నారు.. పెద్ద కుమారుడు ఇప్పటికే “భలే భలే మగాడివో “చిత్రం లో చిన్ననాటి నాని గా నటించి మెప్పించారు..చిన్న కుమారుడు “ గూఢచారి “చిత్రంలో చిన్ననా టి అడవి శేష్ గా కనపడారు .

ఇంకా మన మాస్ మహా రాజా రవి తేజ కూడా తాన తనయుడు మహాధన్ ని “ రాజా ది గ్రేట్ “ చిత్రం తో మన ముందుకు తీసుకు వచ్చారు ..

నందమూరి వారి హావ ఇప్పటిడి కాదు.. .ఈ జాబితాలోకి బుల్లి ఎన్టీఆర్ కూడా రాబోతున్నారు.. జూనియర్ ఎన్టీఆర్ గారి కుమారుడు “ అభయ్ రామ్ “ కూడా త్వరలోనే వెండి తెర పై దర్శనం ఇవ్వనున్నారు .. ఇప్పటికే తండ్రితో కలిసి చిత్ర షూటింగ్ లకు వెళ్లి తెగ సందడి చేస్తున్నారు..

శ్రీవల్లి..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telugu industry  Actors children  Mahesh Babu  Allu Arjun  Jr NTR  Tollywood  

Other Articles