RRR: Makers announces the female lead opposite Jr NTR జూ.ఎన్టీయార్ సరసన ఛాన్స్ కొట్టేసిన అమ్మడు..

Rajamouli s rrr team makes big reveals heroine and antagonits announced

RRR, RRR update, RRR latest Update, RRR villian, RRR lady villian, RRR heroine, RRR Telugu, Ram Charan, SS Rajamouli, Jr NTR, Alia Bhatt, Olivia Morris, Ray Stevenson, Alison Doody, tollywood, movies, entertainment

Putting an end to all speculations, the makers of the upcoming Ram Charan and Jr NTR starrer RRR unveiled the name of the female lead who will be paired with Jr NTR. Western theatre artiste, Olivia Morris will be seen playing the female lead opposite Jr NTR.

రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ హీరోయిన్, ప్రతినాయకులు వీరే..

Posted: 11/20/2019 06:01 PM IST
Rajamouli s rrr team makes big reveals heroine and antagonits announced

బాహుబలి చిత్రాలను రూపోందించిన యావత్ భారత దేశంలో తనకంటూ క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఆ తరువాత రూపోందిస్తున్న మల్టీస్టారర్ పై అంచనాలు మిన్నంటాయి. మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రధారులుగా 'ఆర్ ఆర్ ఆర్' రూపొందుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ ఇచ్చారు చిత్ర దర్శకుడు జక్కన్న. ఈ చిత్రంలో రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తున్న విషయం తెలిసిందే.

కాగా, ఎన్టీఆర్ జోడీగా హాలీవుడ్ నుంచి ఒక అమ్మాయిని తీసుకుంటే, కొన్ని కారణాల వలన ఆమె తప్పుకుంది. ఆ తరువాత ఆ పాత్రలో ఎవరైతే నిండుదనం వస్తుందా.? అన్న అన్వేషణకు ఎట్టకేలకు ఫుల్ స్టాప్ పడింది. యంగ్ టైగర్ అభిమానులలో సైతం ఆసక్తిని రేకెత్తించిన అంశాన్ని ముగించేస్తూ రాజమౌళి రంగంలోకి దిగి తన ట్విట్టర్ ఖాతా ద్వారా వషయాన్ని వెల్లడించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ బ్యూటీ 'ఒలివియా మోరిస్' నటించనుందని ప్రకటించారు.


"ఒలివియా మోరిస్ కు స్వాగతం .. ఈ సినిమాలో మీరు 'జెన్నిఫర్' అనే ప్రధానమైన పాత్రను పోషించనున్నందుకు మాకు చాలా సంతోషంగా వుంది. మీరు షూటింగులో పాల్గొనే రోజు కోసం ఎదురుచూస్తున్నాము" అంటూ ఈ సినిమా టీమ్ ట్వీట్ చేసింది. ఇక ఈ చిత్రంలో ప్రధాన విలన్ గా, ప్రతినాయకురాలిగా నటిస్తున్న మరో ఇద్దరు నటుల పేర్లను కూడా అయన వెల్లడించారు. రే స్టీవెన్సన్ విలన్ పాత్రలో కనిపించనుండగా, ప్రతినాయకురాలి పాత్రలో అలిసన్ డూడీ నటించనున్నారు.


అలిసన్ డూడీతో ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేశామని రాజమౌళి తన ట్వీట్ లో పేర్కొన్నాడు. ఎ వ్యూ టు కిల్‌, ఇండియానా జోన్స్‌ వంటి సినిమాల్లో ఐరిష్ న‌టి అలిస‌న్ డూడీ న‌టించారు. అలాగే థోర్‌, కింగ్ అర్థ‌ర్‌ స‌హా ప‌లు పాపుల‌ర్ టీవీ షోస్‌లో రే స్టీవెన్ స‌న్ న‌టించారు. ఇక ఈ సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు. జులై 30, 2020 లో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RRR  Ram Charan  SS Rajamouli  Jr NTR  Alia Bhatt  Olivia Morris  Ray Stevenson  Alison Doody  tollywood  

Other Articles