‘కొందరికి మందు తాగడం సరదా. మరికొందరికి వ్యసనం. కానీ, ఈ పార్వతీపురం దేవదాసుకి మాత్రం అది అవసరం’ అని అంటున్నారు నటుడు కార్తికేయ. ఆయన కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘90ఎంఎల్’. నేహా సోలంకి కథానాయిక. శేఖర్ రెడ్డి ఎర్రా దర్శకత్వం వహించారు. గురువారం ఈ సినిమా ట్రైలర్ ను చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. ‘నీతో కలిసి చచ్చేంత ప్రేమ నాలో ఉంది. నాతో కలిసి బతకాలనే ఆలోచనే నీలో లేదు’ అని నేహా చెప్పే డైలాగ్తో ఈ ట్రైలర్ ప్రారంభమవుతోంది.
ట్రైలర్ లోని సన్నివేశాలను బట్టి చూస్తుంటే ఆరోగ్య పరిస్థితుల రీత్యా కార్తీకేయ చిన్నప్పటి నుంచి మద్యం తాగడం అవసరంగా మారుతుంది. కనుక ప్రతిరోజూ ‘90 ఎంఎల్’ మద్యం తాగుతుంటాడు. మద్యం తాగేవారంటే ఇష్టంలేని నేహా ఈ విషయం తెలిసి ‘ఒక్కరోజు మందు తాగకపోతే చచ్చిపోతావా’ అని ప్రశ్నించగా.. ‘అవును.. చచ్చిపోతాను’ అని కార్తికేయ చెబుతాడు. ఎంతో ఆసక్తికరంగా ఉన్న ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. డిసెంబర్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more