‘మహర్షి’ సక్సెస్తో ఫుల్ జోష్లో ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. అదే ఊపులో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబు ఫస్ట్ టైమ్ మిలటరీ ఆఫీసర్ అజయ్ కృష్ణ పాత్రలో నటిస్తున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాలో ఒకప్పటి లేడీ అమితాబ్ విజయశాంతి నటిగా రీ ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే దీపావళి సందర్భంగా విజయ్ శాంతి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు.
భారతి అనే లెక్చరర్ పాత్రలో విజయ శాంతి లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను దిల్ రాజు, అనిల్ సుంకరతో కలిసి మహేష్ బాబు కూడా నిర్మిణ బాధ్యతలను పంచుకున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేయనున్నారు. కాగా, తాజాగా ఈ సినిమా టీజర్ ను ఇవాళ విడుదల చేశారు. సూపర్ స్టార్ టీజర్ చిత్రంపై అంచనాలను భారీగా పెంచేస్తోంది.
ఈ టీజర్ లో మహేశ్ బాబు పంచీ డైలాగ్స్ తో అదరగొట్టాడు. "భయపడేవాడే బేరానికి వస్తాడు... మనదగ్గర బేరాల్లేవమ్మా...." అంటూ తనదైన శైలిలో పలికిన డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. మీరు మా బాధ్యత అంటూ ప్రతీ ఆర్మీ మ్యాన్ మనస్సులోని మాటలను తెలియజేసి.. వారి పట్ల గౌరవం ఇనుమడింపజేశాడు, "గాయం విలువ తెలిసినవాడే సాయం చేస్తాడు" అంటూ విజయశాంతి, "ప్రతి సంక్రాంతికి అల్లుళ్లొస్తారు, ఈ సంక్రాంతికి మొగుడొచ్చాడు" అంటూ ప్రకాశ్ రాజ్ పలికిన డైలాగ్స్ ప్రేక్షకుల్లోకి చొచ్చుకుపోతాయనడంలో సందేహంలేదు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more