విక్టరీ వెంకటేశ్ .. యువ సామ్రాట్ నాగచైతన్య కథానాయకులుగా రూపొందిన 'వెంకీమామ'.. బొమ్మ దుమ్మదులిపేస్తోంది. ఈ నెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసును షేక్ చేస్తోంది. కేఎస్ రవీంద్ర దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. కానీ అప్పటికి గట్టిపోటీ ఉండటంతో, ముందుగానే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
గ్రామీణ నేపథ్యంలో సాగిన ఈ కథ, కామెడీ .. ఎమోషన్ .. యాక్షన్ .. సంగీతం .. గ్లామర్ పరంగా ఆడియన్స్ నుంచి మంచి మార్కులు కొట్టేసింది. తొలి మూడు రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 45 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది.. అదే జోరుతో 50 కోట్ల క్లబ్ లోకి అవలీలగా చేరబోతోంది. ఈ మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 17.78 కోట్ల షేర్ సాధించిన ఈ సినిమా, ఒక్క నైజామ్ లోనే 6.72 కోట్ల షేర్ ను రాబట్టడం విశేషం. ఈ సినిమాతో ఆర్ఎక్స్ 100 బామ పాయల్ రాజ్ పుత్ .. రాశి ఖన్నా ఖాతాలలోనూ మరో హిట్ చేరిపోయింది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more