GST Raids On Tollywood Celebrities Houses టాలీవుడ్ ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాలపై జీఎస్టీ సోదాలు..

Gst raids on tollywood celebrities houses at hyderabad

GST Raids, Lavanya Tripati, Anasuya Bharadwaj, Suma Kanakala, Pankatham Vamsi, Haarika and Hassine creations, sitara Entertainments, Tollywood, movies, Entertainment

The GST officials are still conducting raids on the houses of Tollywood celebrities. According to the sources, they have raided on 15 houses and it is learnt that they have not paid the tax and submitted wrong proofs. It is alleged that many directors and producers have not paid taxes.

టాలీవుడ్ ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాలపై జీఎస్టీ సోదాలు..

Posted: 12/24/2019 01:14 PM IST
Gst raids on tollywood celebrities houses at hyderabad

టాలీవుడ్‌ ప్రముఖులే లక్ష్యంగా జీఎస్టీ అధికారుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవలే ఐటీ దాడులు ఆ తరువాత జీఎస్టీ దాడుల నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖులు కలవరం చెందుతున్నారు. సినీప్రముఖులే టార్గెట్ గా ఈ దాడులు జరుగుతున్న క్రమంలో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఇవాళ దాదాపు 15 మంది ప్రముఖుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. దర్శకులు, నిర్మాతలే కాదు.. ప్రముఖ బిల్డర్స్, స్టీల్ వ్యాపారులు, ఫైనాన్స్ సంస్థలపై కూడా ఇవాళ దాడులు కొనసాగుతున్నాయి..

తప్పుడు పత్రాలు సృష్టించి జీఎస్టీ పన్నులు చెల్లించకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించారన్న అభియోగాలపై జీఎస్టీ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. కాగా, ఇటీవల ప్రముఖ నటి లావణ్య త్రిపాఠి, యాంకర్ సుమ, అనసూయ ఇళ్లపై జీఎస్టీ అధికారులు దాడులు నిర్వహించారని వార్తలు వచ్చినా.. వాటిని ఆయన సెలబ్రిటీలు ఖండించారు. అయితే సోదాలు ఎవరిపై జరిగాయన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తాజాగా మరికోందరు ప్రముఖలు ఇళ్లు, కార్యాలయాలపై జీఎస్టీ అధికారులు దాడులు చేస్తున్నారు.

ప్రముఖ రచయిత, దర్శకుడు వక్కంతం వంశీ ఇంటిపై, ఆఫీసుల్లో కూడా జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. హారిక హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్టైన్మెంట్స్ కార్యాలయంపై ఏక కాలంలో దాడులు చేశారని సమాచారం. వీరితో పాటు పలువురు ప్రముఖ సెలబ్రిటీల ఇళ్లు, కార్యాలయాలపై కూడా దాడులు జరుగుతున్నాయని సమాచారం. ఆదాయాన్ని తక్కువగా చూపిస్తూ ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నులను ఎగ్గొట్టారనే ఆరోపణలు రావడంతో జీఎస్టీ అధికారులు రంగంలోకి దిగినట్టు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles