రీల్ లైఫ్ లో విలన్.. క్యారెక్టర్ అర్టిస్టుగా తనకంటూ ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న ఈయన రియల్ లైఫ్ లో మాత్రం హీరో అనిపించుకున్నాడు. ఎంతో ధైర్యంతో, సహాసంతో ఆయన చేసిన పని.. ప్రస్తుతం నెట్టింట్లో ప్రశంసలను అందుకునేలా చేస్తోంది. ఇంతకీ ఆ హీరో, విలన్ ఎవరంటారా.. ఆయనే షియాజీ షిండే. ఆస్ట్రేలియాలో రేగిన వైల్డ్ ఫైర్ కార్చిచ్చు.. ఎంతోమందిని నిరాశ్రయుల్ని చేయగా, కొందరిన బలి తీసుకుంది. ఇక అనేక వన్యమృగాలను కూడా కబళించిన విషయం తెలిసిందే. సరిగ్గా అలానే ఓ అటవీ ప్రాంతంలో రేగిన మంటలను చూసి ఆయన స్పందించిన తీరు.. ప్రదర్శించిన సమయస్పూర్తికి నెట్ జనులు ముగ్ధులయ్యారు.
మహారాష్ట్రలోని పూణె శివార్లలో ఉన్న కాట్ రాజ్ ఘాట్ రోడ్డులో క్రితం రోజున తన కారులో వస్తున్న ఆయన మార్గమధ్యంలో అడవిలో చెలరేగిన మంటలను గమనించాడు. అడవి తగలబడుతొందా.? లేక ఎవరైనా మంట పెట్టారా అని అలోచించకుండా.. అస్ట్రేలియాలో రేగిన కార్చిర్చు గాయల నేపథ్యంలో అప్రమత్తమయ్యారు. వెంటనే కారు ఆపి కిందికి దిగి తగలబడుతున్న ప్రదేశానికి వెళ్లారు. సమయానికి చెంత నీళ్లు లేకపోవడంతో అగ్గిని చల్లార్చేందుకు పచ్చి తుప్పలు పట్టుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు.
మంటలు ఎగసిపడుతున్నా వెనకడుగు వేయకుండా ఆపే ప్రయత్నం చేశారు. ఆయనకు ఆ తర్వాత కార్పొరేటర్ రాజేష్ బరాతే జత కలవడంతో ఇద్దరూ కలిసి కష్టపడి మంటలను అదుపు చేసి పెను ప్రమాదం జరగకుండా అడ్డుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు షిండేపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆయనకున్న సామాజిక స్పృహకు హ్యాట్సాప్ చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more