prudhvi raj sensational comments on Mega star ‘‘మెగాస్టార్ లేకపోతే నేను బతికుండేవాడినే కాదు’’

If not for chiranjeevi i would have committed suicide

Prudhvi Raj comments on Chiranjeevi, Prudhvi Raj latest interview, Prudhvi Raj sensation, Prudhvi Raj News, Prudhvi Raj Update, Prudhvi Raj comments, Prudhvi Raj on tollywood, Prudhvi Raj comments on tollywood YS Jaganmohan Reddy News, YSR Congress Party News, Rajendra Prasad News, Rajendra Prasad movie news, Prudhvi Raj, YS Jaganmohan Reddy, YSR Congress Party, Chiranjeevi, tollywood, movies, entertainment

Tollywood senior actor, Ysr congress party leader Prudhvi Raj sensational comments on Chiranjeevi. In latest intreview he says about SVBC issue.

‘‘మెగాస్టార్ లేకపోతే నేను బతికుండేవాడినే కాదు’’

Posted: 03/09/2020 05:52 PM IST
If not for chiranjeevi i would have committed suicide

శ్రీవెంకటేశ్వర భక్తీ ఛానల్ (ఎస్వీబీసీ) మాజీ చైర్మన్, టాలీవుడ్ నటుడు 30 ఇయర్స్ డైలాగులో పాపులర్ అయిన పృథ్వీ రాజ్.. మెగాస్టార్ చిరంజీవి లేకపోతే తాను అసలు బతికి ఉండెవాడినే కాదని అన్నారు. ఎస్వీబీసీ వ్యవహారంలో తనను అన్యాయంగా ఇరికించారని ఆరోపించిన ఆయన.. తాను ఇబ్బందుల్లో ఉండి ఆత్మహత్య చేసుకోవాలన్న అలోచనలో వున్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి మాత్రమే అండగా నిలిచారని చెప్పారు పృథ్వీ. ఆయన అండ, మద్దతు లేకపోయివుంటే.. బలహీన క్షణాల్లో తాను ఏంమయ్యేవాడినో కూడా తెలియదంటూ పలు వ్యక్తిగత విషయాలు వెల్లడించారు.

ఎస్వీబీసీ ఛానల్ మహిళా ఉద్యోగినితో మాట్లాడిన రాసలీలల ఫోన్ కాల్ ఫేక్ అని పేర్కొన్నారు. ఛానెల్ లో పనిచేయాలని తలచడమే పాపమైపోయిందని, పనిచేయని వాళ్లపై చర్యలు తీసుకునే క్రమంలో వాళ్లే.. తనను వాళ్లు చెప్పుతో కొట్టి బయటకు పంపించారని ఆయన బాధాతప్త హృదయంతో వెల్డించారు, తనకు పదవి లభించడం కూడా తనవాళ్లే ఇష్టంలేదని.. అయితే తానెప్పుడూ ప్రాకులాడలేదని తెలిపారు. తాను రైతుల గురించి ఎటువంటి తప్పుడు మాటలు మాట్లాడలేదని, కొందరు కావాలనే వాటిని వక్రీకరించారని పేర్కొన్నారు. తాను ఎదగడం పార్టీలో ఇష్టం లేక కొందరు కొన్ని అభియోగాాలు మోపారని, అవన్నీ భరించింది జగన్మోహన్ రెడ్డిపై అభిమానంతోనే అని వెల్లడించారు.

వెంకటేశ్వరస్వామి సాక్షిగా చెప్తున్నానన్న పృథ్వీ, తనను ఇబ్బంది పెట్టినవారు ఎవరూ బ్రతికిలేరని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి గురించి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు పృథ్వీ. చిరంజీవి గొప్ప వ్యక్తని, వివాదం జరిగిన తర్వాత తనకు అవకాశలివ్వమని చెప్పిన వ్యక్తి మెగాస్టార్ అని చెప్పుకొచ్చారు. పృథ్వీ మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు, వేషాలు ఇచ్చి ఎంకరేజ్ చెయ్యమని చెప్పింది ఆయన ఒక్కరే అని ఎమోషనల్ అయ్యారు. ఆయన అలా చెయ్యకపోతే అప్పుడున్న పరిస్థితుల్లో సూసైడ్ చేసుకునేవాడ్ని అంటూ షాకింగ్ విషయాన్ని వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles