Romantic song from V the movie నాని, సుధీర్ ల ‘వి’ నుంచి మరో రోమాంటిక్ సాంగ్..

V continues musical success of its celebrated director

Mohan Krishna Indraganti, V the movie, Sammohanam, Nani, Sudheer Babu, Vasthunna Vachesthunna, Nivetha Thomas, Aditi Rao Hyderi, Amit Trivedi, Dil Raju, Tollywood, Movies, Entertainment

Vasthunnaa Vachestunna lyrical video song is out. It is taken from the Telugu film V starring actors Nani, Sudheer Babu, Nivetha Thomas and Aditi Rao Hydari in the prime roles. Vasthunnaa Vachestunna song is crooned by Shreya Goshal, Amit Trivedi, Anurag Kulkarni. Amit Trivedi composes the music and Seetharamasastry pens the lyrics.

నాని, సుధీర్ ల ‘వి’ నుంచి మరో రోమాంటిక్ సాంగ్..

Posted: 03/10/2020 05:04 PM IST
V continues musical success of its celebrated director

‘చూస్తున్నా చూస్తూనే ఉన్నా.. కనురెప్పైనా పడనీక.. వస్తానని చెబుతున్నా మనసుకు వినిపించదు తెలుసా..’ అంటోంది కథానాయిక నివేదా థామస్‌. ఆమె, సుధీర్‌బాబు, నాని, అదితిరావు హైదరి ప్రధాన తారాగణంగా నటిస్తున్న సినిమా ‘వి’. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకుడు. ఈ సినిమాలోని ‘వస్తున్నా.. వచ్చేస్తున్నా.. వద్దన్నా వదిలేస్తానా..’ అని సాగే గీతాన్ని విడుదల చేశారు. సుధీర్‌బాబు, నివేదాపై ఈ పాటను చిత్రీకరించారు. ఈ పాటను శ్రేయా ఘోషల్‌, అమిత్‌ త్రివేది, అనురాగ్‌ కులకర్ణి ఆలపించారు.

వస్తున్నా.. వచ్చేస్తున్నా.. వద్దన్నా వదిలేస్తానా.. కౌవిస్తూ కనబడకున్నా.. ఉవ్వెతున్న ఉరికోస్తున్నా.. చెలియా చెలియా నీ..తలపే తరిమిందే అడుగే అలలయ్యే అరాటమే పెంచగా.. గడియో క్షణమోయి.. దూరం కరగాలే.. ప్రాణం బాణంలా విరహాన్ని వేటాడగా.. మురిపించే ముస్తాబై వున్నా.. దరికోస్తే అందిస్తాగా అనందంగా.. వస్తానని చెబుతున్నా మనసుకు వినిపించదు తెలుసా.. అంటూ సాగుతున్న ఈ రోమాంటిక్ సాంగ్ ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటోంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించగా.. అమిత్‌ త్రివేది బాణీలు సమకూర్చారు.

‘సుధీర్‌, నివి (నివేదా) కెమిస్ట్రీ. శ్రేయా ఘోషల్‌, అమిత్‌ త్రివేదిల స్వరం, శాస్త్రి గారి మ్యాజిక్‌’ అంటూ నాని ఈ పాటను షేర్‌ చేశారు. ఈ గీతం ప్రస్తుతం యూట్యూబ్‌లో శ్రోతల్ని అలరిస్తోంది. సుధీర్‌, నివేదా కెమిస్ట్రీ బాగుందని కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు VTheMovie అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్విటర్‌ ట్రెండింగ్‌లో ఉంది. ‘వి’లో నాని ప్రతినాయకుడి ఛాయలున్న పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. మార్చి 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles