కరోనా కష్టంతో అల్లాడుతున్న ప్రజలకు సాయంగా నిలుస్తూ రూ. కోటీ పాతిక లక్షల భారీ సాయం ప్రకటించిన నటసింహం నందమూరి బాలకృష్ణకు ప్రత్యేక అభినందలు తెలియజేశారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సందర్భంగా ఆయనపై ప్రశంసల జల్లు కురిపిస్తూ ట్వీట్ చేశారు మెగాస్టార్. ఇదే సమయంలో తమను ఇంతటి వారిని చేసిన సీనీకళామతల్లిని నమ్ముకున్న దినసరి కూలీలకు కూడా ఆపన్నహస్తం అందించిన బాలయ్యకు చిరంజీవి కృతజ్ఞతలు తెలియజేశారు.
థాంక్యూ మై డియర్ బ్రదర్ బాలయ్య.. ప్రతి కష్టసమయంలోనూ ప్రజలను ఆదుకోవడం కోసం సినీ పరిశ్రమ ఒక్కటిగా ముందుకొస్తే మీరెప్పుడూ తోడుంటారు. కరోనా క్రైసిస్‌తో ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన ‘కరోనా క్రైసిస్ ఛారిటీ (CCC)కి రూ. 25 లక్షలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ. 50 లక్షలు, తెలంగాణ ప్రభుత్వానికి రూ. 50 లక్షలు ఆర్ధిక సాయాన్ని ప్రకటించారని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు చిరు. ఈ సందర్బంగా ‘కరోనా క్రైసిస్ ఛారిటీ (CCC)కి అందించిన రూ. 25 లక్షల చెక్‌ను ట్విట్టర్లో షేర్ చేశారు చిరంజీవి.
ఈ చెక్‌పై కరోనా క్రైసిస్ ఛారిటీతో పాటు చిరంజీవి ఛారిటిబుల్ ట్రస్ట్ అని కూడా రాసి ఉండటం విశేషం. కాగా బాలయ్య చేసిన సాయానికి ట్విట్టర్లో ప్రశంసల జల్లు కురుస్తోంది. పెట్టినా కొట్టినా మా బాలయ్యే అందుకే మా బాలయ్య మనసు బంగారం.. ఎంత మంది ఎన్ని హేళనలు చేసి సాయం చేయడంలో బాలయ్య మనసు పెద్దదే అని మరోసారి నిరూపించారు.. జై బాలయ్య అంటూ ట్విట్టర్‌ని హీటెక్కిస్తున్నారు బాలయ్య, చిరు అభిమానులు.
Thank you dear brother #Balayya #NBK for donating 25 lacs to #CoronaCrisisCharity & 50 lacs each to Telangana & AP Govts. You proved ur generous heart goes out to the needy every time.ప్రతి కష్టసమయంలోను,ప్రజలను ఆదుకోవటం కోసం సినీ పరిశ్రమ ఒక్కటిగా ముందుకొస్తే,మీరెప్పుడు తోడుంటారు pic.twitter.com/9IWMw3ovMn
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 3, 2020
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more