ప్రస్తుతం టాలీవుడ్లో వరుసగా హిట్స్ కొడుతూ దూసుకెళ్తున్నాడు యంగ్ సక్సెఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. 2020 సంక్రాంతి పండుగ కానుకగా సూపర్ స్టార్ మహేష్ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’తో మరొక హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. గతేడాది సంక్రాంతికి విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్2’ తో మంచి హిట్ అందుకున్న అనిల్, ప్రస్తుతం దానికి కొనసాగింపుగా ‘ఎఫ్3’ మూవీ కథ సిద్ధం చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు.
ఈ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను ఒక ప్రముఖ తెలుగు పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రేక్షకులతో పంచుకున్నాడు అనిల్. ప్రస్తుతం తమ సొంత ఊళ్ళో ఎఫ్3 కథ సిద్ధం చేస్తున్నానని, ఈ సినిమా ద్వారా ఇటీవల బాలీవుడ్లో వచ్చిన ‘గోల్ మాల్’, ‘హౌస్ ఫుల్’ సినిమాల మాదిరిగా ఫ్రాంచైజీలు తీసుకురావాలనేది తన ఆలోచన అని చెప్పుకొచ్చాడు. ఇక ‘ఎఫ్2’ లోని పాత్రలే ఇందులోనూ ఉంటాయని, దానితో పాటు సినిమా ట్యాగ్‌లైన్‌లో చెప్పినట్లు ఇందులో కూడా ఫన్, ఫ్రస్ట్రేషన్ రెండూ ఉంటాయన్నారు.
వెంకటేష్ గారిని కోబ్రో అని వరుణ్ ఎందుకు పిలిచారు, అలానే వెంకటేష్ గారు వెంకీ ఆసన్ ఎందుకు వేశారు వంటి అంశాలు ఇందులో మరింత ఆసక్తికరంగా ఉండడంతో పాటు, ముఖ్యంగా ఈ సినిమా కథకు మంచి థీమ్ దొరికింది.. అయితే గత కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో ఈ సినిమాలో మరో హీరో కూడా నటిస్తాడని ప్రచారం జరగుతుంది. నిజానికి ఇప్పటివరకు మొదటి అర్ధ భాగం పూర్తయిన మేరకు మూడో క్యారెక్టర్ ఏమీ రాలేదు.. అయితే సెకండాఫ్ రాయడం మొదలెట్టిన తరువాత మూడవ హీరో అవసరం ఉందనుకుంటే ఆ పాత్రను చేర్చడం జరుగుతుంది అని చెప్పుకొచ్చాడు అనిల్ రావిపూడి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more