actress hema gives strong warning to netizen నటి హేమ కోపాన్ని చవిచూసిన నెట్ జన్.. ఎందుకంటే..

Actress hema fires on netizen who askes a kiss while on live

Hema, Actress, Strong Counter, online LIve, Live kiss proposal, social media, Netizen, Tollywood

Actress Hema thrashes a netizen while on live as he proposed and asked for a kiss. This made her irritated and she fired on the netizen and scolded him to thrash him by comming to his home.

నటి హేమ కోపాన్ని చవిచూసిన నెట్ జన్.. ఎందుకంటే..

Posted: 04/28/2020 05:31 PM IST
Actress hema fires on netizen who askes a kiss while on live

జూనియర్ ఎన్టీఆర్ ‘బృందావనం’ సినిమాలో లోపల ఒరిజినల్ అలాగే ఉంది. దాన్ని బయటకు తీస్తే రచ్చ రచ్చే అనే డైలాగ్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఇప్పుడీ డైలాగ్ టాలీవుడ్ నటి హేమ నోటి వెంట వచ్చింది. అలాగే బాలయ్య ‘లెజ్ండ్’ మూవీలో అడ్రస్ ఇవ్వు ఇంటికొచ్చి కొడతా అన్నట్టు ఇంటికొచ్చి మరీ తంతా వెధవ అంటూ ఫైర్ అయింది. అసలేం జరిగిందంటే.. తాజాగా హేమ సోషల్ మీడియా లైవ్‌లో హెయిర్ ఆయిల్ గురించి వివరిస్తూ తనకు వాళ్ల అమ్మ ఈ నూనె రాసేదని, తన కూతురు ఈషాకు కూడా తను ఇదే ఆయిల్ వాడుతానని చెప్పుకొచ్చింది.

ఈ వయసులోనూ అందంగా ఉన్నారు, మీ ఏజ్ ఎంత? అని కొందరు ఆకతాయిలు అడగడంతో హేమ వాళ్లపై కస్సుబస్సులాడింది. మాటిమాటికీ ఈ వయసులో.. ఈ వయసులో అంటున్నారు. నాకేమైనా 60, 70 ఏళ్లు ఉన్నాయా? నా కూతురు ఇంటర్ చదువుతోంది. నేను ఇప్పటికీ యంగే. నా వయసు తెలుసుకుని ఏం చేస్తావురా? పెళ్లి చేసుకుంటావా అని ఘాటుగా రిప్లై ఇచ్చింది.

ఈ లోపు మరో నెటిజన్.. ఐ లవ్‌ యూ బేబీ అని మెసేజ్‌లు పెడుతూ హేమని ముద్దు అడిగాడు. దీనితో హేమ కోపం కట్టలు తెంచుకుంది. ‘ఇంటికొచ్చి మరీ తంతా వెధవ.. తిక్క తిక్క వేషాలు నా దగ్గర వేయొద్దు. నేను పైకి ఇలా కనిపిస్తాను. లోపల ఇంకో క్యారెక్టర్ ఉంది. దాన్ని బయటకు తీయొద్దు. పళ్లు ఊడగొట్టి చేతిలో పెడతా.. నా గురించి ఏమనుకుంటున్నావో జాగ్రత్త’.. అంటూ దబిడి దిబిడే స్టైల్లో వార్నింగ్ ఇచ్చింది. ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hema  Actress  Strong Counter  online LIve  Live kiss proposal  social media  Netizen  Tollywood  

Other Articles