కవి గారి ఇంటి మీద వాలిన కాకి కూడా కవిత్వం చెప్పగలదని నానుడి అలాంటిది తమ జీన్స్ లోనే నటన, డాన్స్ వున్న చిన్నారికి మంచి మ్యూజిక్ వినబడితే అలోచిస్తారా.. లేక మైమరచి డాన్స్ వేస్తారా.? అంటే రెండవదే చేస్తారని ఎవరైనా ఠకీమని చెప్పేస్తారు. అలాంటిది ఏకంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మనవరాలు నవిష్క ఏడాది వయస్సులో తమ ఇంట్లో చిరంజీవితో కలసి మి మి మిమిమి యు అండ్ మి అనే పాటకు ఆ చిన్నారి టీవీలో వస్తున్న పాటకు అనుగూణంగా డాన్స్ వేయడంతో పాటు ఏకంగా చిరంజీవికే ఈ పాటపై ఎలా డాన్స్ చేయాలో అన్న విధంగా మూమ్ మెంట్స్ నేర్పుతున్నట్లు వుంది.
లాక్‌డౌన్‌తో షూటింగ్స్ లేక ఇంటి వద్దనే ఉంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. దీంతో ఇంట్లో పనులూ చేస్తూ.. మొన్న అబ్బుర పరిచిన చిరు.. ఇప్పుడు మనవరాలితో కలిసి చిన్న చిన్న స్టెప్పులు వేశారు. ఏడాది వయసున్న తన మనవరాలు నవిష్కను ఆటపట్టిస్తూ.. ఆ చిన్నారితో పాటు డ్యాన్స్ చేస్తున్న వీడియోను మెగాస్టార్ తన ట్విట్టర్ అకౌంట్లో ట్వీట్ చేశారు. ‘ఖైదీ నెంబర్.150’ సినిమాలోని ఓ పాటకు డ్యాన్స్ చేస్తూ కనిపించారు.
ఈ వీడియోలో తన మనవరాలు నవిష్కను ఒడిలో కూర్చోపెట్టుకొని, తనను ఏ పాట కావాలని చిరంజీవి అడగగా.. దానికి ‘మీమీ’ అంటూ ముద్దుగా చెప్పింది నవిష్క. ఎప్పుడూ అదే పాటేనా మరోకటి విందామని ఆ బుజ్జాయితో చెప్పగా, బుంగబూతి పెట్టుకుని ఏడవడం ప్రారంభించింది. వెంటనే సముదాయించి.. టీవీలో ‘మిమ్మీ మిమ్మిమ్మీ’ సాంగ్‌ని ప్లే చేశారు చిరు. అప్పుడు ఆనందంతో గంతులు వేసింది నవిష్క. తనతో పాటే.. చేతులూ కదుపుతూ డ్యాన్స్ చేశారు మెగాస్టార్. అయితే ఈ పాటని మధ్యలో ఆపి మనవరాలిని ఆటపట్టించారు చిరు.
Always amazed @ the power of music.Just over 1 yr & how this little kid enjoyed music & tried doing dance moves is sheer bliss.Paused & played music 2 see she was really loving it.పాట నాది కాబట్టి,అమ్మమ్మ సురేఖ దగ్గర క్రెడిట్ నాకే #PreLockdownMoments #Throwbackvideo #navishka_k pic.twitter.com/znNOyMY0MB
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 28, 2020
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more