Shriya Saran to raise funds for Covid-19 cause అభిమానులకు శ్రీయ ‘సంతోషం’.. అన్నార్థులకు సాయం..

Shriya saran ready to dance with fans for rupees 200 to raise funds

Shriya saran, Shriya saran on covid, Shriya saran online yoga video, shriya saran, shriya, shriya saran movies, shriya saran songs, shriya movies, shriya saran husband, shriya saran photoshoot, hot shriya, actress shriya, actress shriya wedding photos, actress shriya marriage photos, coronavirus, dialy waged labour, homeless poor, orphans, destitute elders, dance, yoga, rs 200, tollywood, entertainment, movies

Barcelona-based Shriya Saran, has offered to raise funds for combating the coronavirus lockdown impact on the film workers. Her offer is that anyone who contributes Rs 200 for the cause can be eligible to participate in her on a live session on a lucky draw basis.

అభిమానులకు శ్రీయ ‘సంతోషం’.. అన్నార్థులకు సాయం..

Posted: 05/05/2020 07:34 PM IST
Shriya saran ready to dance with fans for rupees 200 to raise funds

యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున సంతోషం చిత్రంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలలో తన స్థానాన్ని పదిలం చేసుకున్న హీరోయిన్ శ్రియ సరన్.. ఇటు దక్షిణభారతంతో పాటు అటు బాలీవుడ్ ను ఏ రేంజ్ లో ఏలేసింది. వివాహం చేసుకున్నాక చిత్రపరిశ్రమకు కాసింత దూరమైన ఈ నటి.. చలనచిత్ర పరిశ్రమలో ఓ రేంజ్ లో వెలుగుతున్న సమయంలోనే చారిటీ కార్యక్రమాలకు అంకురార్ఫణ చేసింది. ఇక వెండితెరపై తనకంటూ ప్రత్యకత తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ చూడడానికి అమాయకంగా కనిపిస్తూ అభిమానుల మనసులను తన అందచందాలతో కొల్లగొడుతూనే ఉంది.

ఇష్టం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనా సంతోషం నుంచి తెలుగు ప్రేక్షకులకు సంతోషాన్నిపంచింది శ్రియ. ఇక ఆతర్వాత వెనుకకు తిరిగి చూసుకోలేదు. వరుసగా సినిమాలు చేస్తూ తన అందచందాలతో కొన్ని సంవత్సరాలు తెలుగు చిత్రసీమను ఓ ఊపు ఊపేసింది. అయితే ప్రస్తుతం పెద్దగా సినిమా అవకాశాలు లేకపోవడంతో పెళ్లి చేసుకున్న శ్రియ భర్తతో కలిసి జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. శ్రియ ప్రస్తుతం భర్త ఆండ్రీతో కలిసి స్పెయిన్‌లో ఉంటోంది. కాగా లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకునేందుకు తన వంతుగా ఓ వినూత్న ఐడియాతో ముందుకొచ్చింది.

అందులో భాగంగా ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేస్తోన్నశ్రియ.. రూ.200 చెల్లించి తనతో కలిసి డ్యాన్స్, యోగా చేయవచ్చంటూ ఆఫర్ ప్రకటించించింది. శనివారం సాయంత్రం వరకు మాత్రమే ఈ అవకాశం అందుబాటులో ఉన్నట్టు ఆమె తెలిపింది. కోవిడ్ బాధితుల కోసం విరాళాలు సేకరించేందుకు ‘ది కైండ్‌నెస్ ఫౌండేషన్, చెన్నై టాస్క్‌ఫోర్స్ బృందాలతో కలిసి పనిచేస్తున్నట్టు చెప్పిన శ్రియ.. లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న కూలీలు, వృద్ధులు, వికలాంగులు, అనాథల కోసం విరాళాలు సేకరించబోతున్నట్టు తెలిపింది. అయితే తనతో డ్యాన్స్ చేయాలంటే www.thekindnessproject.in అనే వెబ్ సైట్‌లో రూ.200 విరాళంగా చెల్లించి.. ఆ రసీదును ఈమెయిల్ చేయాలని పేర్కోంది.

 
 
 
View this post on Instagram

I Have teamed up with The Kindness Foundation and Chennai Task Force to help with their covid relief efforts They’re addressing those who are most vulnerable: destitute elderly, daily wage laborers, the homeless, orphans, and disabled - Will be offering two lucky winners a chance to dance, do some yoga, or whatever floats your boat to brighten up your quarantine - all you have to do to enter is donate Rs. 200 and email your receipt to This email address is being protected from spambots. You need JavaScript enabled to view it. The contest will run until Saturday at 8pm, and winners will be contacted on Sunday You can swipe right for details or head to The Kindness Foundation page let’s have some fun together and do some good too!

A post shared by Shriya Saran (@shriya_saran1109) on

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shriya saran  coronavirus  dialy waged labour  homeless poor  orphans  destitute elders  dance  yoga  rs 200  tollywood  

Other Articles