టాలీవుడ్ హీరో.. బాహుబలి సిరీస్ చిత్రాల ప్రతినాయకుడు.. బిగ్ మ్యాన్ ఖ్యాతి గడించిన రానా దగ్గుబాటి తన మహిళా అభిమానులు నిరాశచెందే వార్తను వెల్లడించాడు. రానా దగ్గుబాటి ఇవాళ తన సోషల్ మీడియా అకౌంట్లో చేసిన ఓ పోస్ట్‌తో అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఓ అమ్మాయితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసి.. ‘ షీ సెడ్ యస్’ (‘ఆమె ఓకే చెప్పింది’) అంటూ షాక్ ఇచ్చారు. ఆమె పేరు మిహీకా బజాజ్ అని తెలిపారు. ఈ ఫొటోకు తెగ కామెంట్లు, లైక్‌లు వచ్చాయి. అందరూ రానాకు శుభాకాంక్షలు చెప్పారు.
ఈ న్యూస్ పట్ల తెలుగు హీరోయిన్లు సమంత, శ్రుతి హాసన్, హన్సిక, రాశీ ఖన్నా, కియారా అడ్వాణీ శుభాకాంక్షలు చెప్పారు. ‘ఓమైగాడ్.. కంగ్రాట్స్’ అని రామ్ చరణ్ సతీమణి ఉపాసన కామెంట్ చేశారు. ‘మై మెన్.. శుభాకాంక్షలు.. ఎంగేజ్డ్ గ్యాంగ్‌లోకి నీకు స్వాగతం’ అని నిఖిల్ ట్వీట్ చేశారు. నితిన్‌ను కూడా ట్యాగ్ చేశారు. త్వరలోనే రానా పెళ్లి కుమారుడు కాబోతున్నట్లు తెలుస్తోంది. రానా ఈ ఫొటో షేర్ చేసిన 15 నిమిషాల్లోనే దాదాపు 45 వేల మంది లైక్ చేయడం విశేషం. మిహీకా బజాజ్ స్వస్థలం హైదరాబాద్. ఆమె ‘డ్యూ డ్రాప్ స్టూడియో’ అనే ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీని నడుపుతున్నారు.
‘యన్.టి.ఆర్’ బయోపిక్ తర్వాత రానా ‘హౌస్‌ఫుల్ 4’లో సందడి చేశారు. ఆపై ‘అరణ్య’లో నటించారు. తెలుగుతోపాటు హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతోంది. వేసవి కానుకగా ఏప్రిల్‌లో విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని కరోనా కారణంగా వాయిదా పడింది. మరోవైపు ఆయన ‘విరాటపర్వం’ చిత్రంలో నటిస్తున్నారు. వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. రానా నటించిన ‘1945’ విడుదల కావాల్సి ఉంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more