Sharwanand's next in Tamil titled Maha Samudram అజయ్ భూపతితో శర్వానంద్ ద్విబాష చిత్రం

Sharwanand ajay bhupathi team up for bilingual titled maha samudram

Sharwanand, New Movie, Mahasamudram Movie. Ajay Bhupathi, bilingual, Telugu, Tamil, AK Entertainments, Sreekaram, movies, entertainment, tollywood

Ajay Bhupathi's ambitious film Maha Samudram, which has been in pre-production for a while now, will start rolling soon, said to be an intense romantic action drama, will be a bilingual in Telugu and Tamil, and it will feature Sharwanand in the lead role. The title Maha Samudram sounds interesting and promises to be a well-packaged entertainer.

ఆర్ఎక్స్ 100 దర్శకుడితో జతకట్టిన శర్వానంద్

Posted: 09/08/2020 02:19 AM IST
Sharwanand ajay bhupathi team up for bilingual titled maha samudram

వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుని అందలోని పాత్రలను ఛాలెంజింగ్ గా  పోషించిన యంగ్ హీరో శర్వానంద్... మరోమారు అలాంటి  విభిన్నమైన చిత్రకథను ఎంచుకున్నారు. 'ప్రస్థానం', 'గమ్యం' వంటి చిత్రాల్లో తనలోని నటుడ్ని తెలుగు ప్రేక్షకులు ముందు అవిష్కరింపజేసిన ఆయన.. ఈ సారి శర్వా మహాసముద్రంలో మునకేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇదేదో క్లూ అనుకుంటున్నారు కదూ.. నిజమేనండీ.. యంగ్ హీరో శర్వా.. తన నూతన ప్రాజెక్టును ప్రకటించాడు. వరుస చిత్రాలతో బిజీగా మారిన శర్వా తన తదుపరి చిత్రం 'మహాసముద్రం' పేరుతో రానుందని తెలిపాడు. ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ నిర్మించనుంది. ఈ మేరకు నిర్మాణ సంస్థ అధికారిక ప్రకటనను వెలువరించింది.

'ఆర్ఎక్స్100' చిత్రంతో తనలోని దర్శకుడి సత్తాను చాటుకున్న అజయ్ భూపతి .. మహాసముద్రం స్ర్కిప్టును ఓ యాగం తరహాలో విరచించి.. తనలోని దర్శకుడి స్థాయిని మరో మెట్టుకు తీసుకెళ్తుందని అశలు పెట్టుకున్నాడు. మహాసముద్రం స్ర్కిప్టుపై తన ఆశలన్నీ పెట్టుకున్న అజయ్ భూపతి.. ఈ చిత్రాన్ని అదే తరహాలో ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లేందుకు శర్వానంద్ ను ఎంచుకున్నాడు, ద్వీబాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో  తెరకెక్కనుంది. శర్వాతో పాటు ఈ చిత్రంలో మరో హీరో కూడా కనిపించనున్నట్టు సమాచారం. దీంతో మరో హీరోకు తమిళసినీ రంగానికి చెందినవాడై వుంటాడని టాక్ వినబడుతోంది. ఫుల్ ప్యాకేజ్డ్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం వస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం తర్వాత తమ బ్యానర్ నుంచి వస్తున్న మరో క్రేజ్ ప్రాజెక్ట్  అని తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sharwanand  Mahasamudram Movie. Ajay Bhupathi  Sreekaram  movies  entertainment  tollywood  

Other Articles