‘మనసు మమత’, ‘మౌనరాగం’ సీరియల్స్ లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ఆర్ఎక్స్ 100 చిత్రం ద్వారా నిర్మాతగా మారిన అశోక్ రెడ్డిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో వున్న ఆయన కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు కూడా చేపట్టారు, ఆయనతో పాటు నటి శ్రావణి ఆత్మహత్యకు సంబంధించిన అభియోగాలు ఎదుర్కోంటున్న సాయి కృష్ణారెడ్డి, దేవరాజు రెడ్డిలపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రావణి ఆత్మహత్యకు వీరు ముగ్గరు తమ తమ స్థాయిలో అమెపై తీవ్రంగా ఒత్తిడి తీసుకువచ్చారని తేల్చిన పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. కాగా, సాయికృష్ణారెడ్డీ, దేవరాజ్ రెడ్డీలను ఇవాళ రిమాండ్ కు తరలించిన పోలీసులు అశోక్ రెడ్డి కోసం గాలిస్తున్నారు.
టీవీలు, సినిమాల్లో నటించేడంపై ఆసక్తితో కాకినాడ సమీపంలోని గొల్లప్రోలుకు చెందిన ఇరవై ఆరేళ్ల శ్రావణి 2012లె హైదరాబాద్ వచ్చింది. అక్కడ ఓ స్నేహితురాలు ద్వారా అనంతపురానికి చెందిన సాయికృష్ణారెడ్డి పరిచయం అయ్యాడు. వచ్చీరాగానే టీవీ ఆర్టిస్టుగా అవకాశాల కోసం ప్రయత్నించింది. ఈ క్రమంలో 2015లో శ్రావణికి సాయికృష్ణారెడ్డితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ మూడేళ్ల పాటు సన్నిహితంగా కొనసాగారు. 2017లో ఆమెకు అశోక్ రెడ్డి అనే నిర్మాతతో పరిచయం ఏర్పడింది. అశోక్ రెడ్డి నిర్మించిన 'ప్రేమతో కార్తీక్' అనే చిత్రంలో శ్రావణి చిన్న పాత్ర పోషించింది. అప్పటి నుంచి అశోక్ రెడ్డితోనూ ఆమె స్నేహంగా ఉండేది.
2019 ఆగస్టు నుంచి దేవరాజ్ రెడ్డి పరిచయం అయ్యాడు. టిక్ టాక్ వీడియోలతో వీరికి పరిచయం ఏర్పడింది. దేవరాజ్ రెడ్డితో శ్రావణి క్లోజ్ గా ఉండడం సాయికృష్ణకు నచ్చలేదు. ఈ విషయం శ్రావణి తల్లిదండ్రులకు చెప్పాడు. దాంతో అప్పటినుంచి శ్రావణిని ఆమె తల్లిదండ్రులు, సాయి వేధించడం మొదలుపెట్టారు. దేవరాజ్ తో మాట్లాడుతుందని శ్రావణిపై సాయికృష్ణ దాడికి కూడా పాల్పడ్డాడు. ఈ క్రమంలో దేవరాజ్ రెడ్డికి దూరంగా ఉండాలని ఆమె తల్లిదండ్రులే కాక, సాయి, అశోక్ రెడ్డి కూడా హెచ్చరించారు. అయితే దేవరాజ్ కూడా పెళ్లి పేరుతో శ్రావణిని మోసం చేశాడని పోలీసులు భావిస్తున్నారు. అందుకు కారణం ఆత్మహత్యకు ముందు దేవతో శ్రావణి చాలా సేపు మాట్లాడిందని తేల్చారు.
అయితే ఆ సంభాషణలో ఎక్కడా అతడికి వ్యతిరేకంగా ఆమె మాట్లాడకపోయినా.. పెళ్లి చేసుకుంటానని గతంలో చెప్పినందున అతడి పాత్ర కూడా ఈ కేసులో ఉందని భావించి పోలీసులు దేవరాజ్ ను ఏ3గా పేర్కోన్నారు, సాయి, అశోక్ రెడ్డి తనపై భౌతికదాడులు పాల్పడటం.. తల్లిదండ్రుల ప్రవర్తన వెరసి తీవ్ర మనస్తాపానికి గురైన శ్రావణిని ఆత్మహత్య ప్రేరేపించాయని పోలీసులు బావించారు. దీంతో ఈ కేసులో సాయికృష్ణారెడ్డిని ఏ1, అశోక్ రెడ్డిని ఏ2గా పేర్కొన్నారు. వీరు ముగ్గురూ ఏదో ఒక సందర్భంలో ఆమెను పెళ్లి చేసుకుంటాం అని చెప్పి మోసం చేసినవాళ్లే. ఇలాంటి వాళ్ల పట్ల మిగతా అమ్మాయిలు కూడా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more