Gaali Sampath Trailer: Fa faaa fun-filled entertainment ‘గాలి సంపత్’ ట్రైలర్ ను విడుదల చేసిన రాజమౌళి

Gaali sampath trailer fa faaa fun filled entertainment

Gaali Sampath Trailer, SreeVishnu​, Rajendra Prasad​, Lovely Singh, Tanikella Bharani, Anil Ravipudi, Achu Rajamani​, Anish Krishna, SKrishna​, Sahu Garapati, Harish Peddi, S Krishna, ShineScreens, tollywood, movies, entertainment

Srivishnu and Rajendra Prasad’s upcoming comedy drama ‘Gali Sampat’ has been creating a good buzz for the past few weeks. Director Anil Ravipudi is replacing the presenter with this film, besides being the screenplay, screenplay and direction supervisor of the dialogues.

‘గాలి సంపత్’ ట్రైలర్ ను విడుదల చేసిన రాజమౌళి..

Posted: 02/27/2021 01:35 PM IST
Gaali sampath trailer fa faaa fun filled entertainment

నవ్వుల కిరీటీ రాజేంద్రప్రసాద్, యువ నటుడు శ్రీ విష్ణు కలసి నటిస్తున్న క్రైమ్ ధ్రిల్లర్ ‘గాలి సంపత్’ చిత్రం దర్శకుడు అనీష్ కృష్ణ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన సినిమా ట్రైల‌ర్ ఇవాళ విడుదల చేశారు. ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి చేతుల మీదుగా విడుద‌లైన ఈ చిత్ర టీజర్ అదిలో హాస్యాన్ని అంతంతో సస్పెన్స్ జోడిస్తూ కట్ చేసింది చిత్ర యూనిట్. ప్రముఖ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి స‌మ‌ర్పణ‌లో ఎస్.క్రిష్ణ , షైన్ స్క్రీన్స్ సంస్థ‌ క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

యువ‌ హీరో శ్రీ విష్ణు, ల‌వ్లీ సింగ్, రాజేంద్ర ‌ప్రసాద్ ప్ర‌ధాన‌పాత్రల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమా మ‌హా శివ‌రాత్రిని పురస్కరించుకుని మార్చి 11న విడుదల కానున్న ఈ చిత్రంలో హీరో శ్రీవిష్ణు, రాజేంద్రప్రసాద్ మధ్య కామెడీతో పాటు మంచి ఎమోషన్ ను కూడా పండించడంలో దర్శకుడు అనీష్ కృష్ణ తన దర్శకత్వ ప్రతిభను కనబర్చాడాని టీజర్లో తెలుస్తోంది. టీజర్ ప్రారంభంలోనే ఇందుకు సంబంధించిన వాయిస్ ఓవర్ ను దర్శకుడు వినిపించాడు.

‘‘పిల్లలు తప్పు చేస్తే ఎంతో ప్రేమగా సరిదిద్దుతారు తల్లిదండ్రులు.. అదేంటో కాస్తా మీసాలు వచ్చేసరికి పెద్దోలు ఏం చేసినా.. ఊరికే చిరాకులు వచ్చేస్తాయి.. కోపాలు వచ్చేస్తాయి. నేను కూడా మా నాన్నని కాస్తా ఒప్పిగ్గా, ప్రేమగా అడగాల్సింది..’’ డైలాగ్ తో వారిద్దరి మధ్య ఎమోషన్ బాగా పండించారని అర్థమవుతోంది. 'ప్ర‌తి అమ్మాయికీ డ‌బ్బున్నోడు కావాలి.. లేక‌పోతే ఫారిన్ వాడు కావాలి.. డ‌బ్బున్నోడు ఏం ఇస్తాడండీ? డ‌బ్బే ఇస్తాడు. టైమ్ ఎక్క‌డి నుంచి ఇస్తాడు' అంటూ హీరోయిన్ కి హీరో చెబుతోన్న డైలాగు అల‌రిస్తోంది. హీరోకి తండ్రిగా రాజేంద్ర ప్ర‌సాద్ న‌ట‌న ఆక‌ర్షిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles