మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన తొలి సినిమా ఉప్పెన హిట్ టాక్ ను సోంతం చేసుకున్న విషయం తెలిసిందే. రూ.8 కోట్ట బడ్జెట్ తో రూపోందించాలని భావించిన ఈ చిత్రం ఏకంగా రూ.22 కోట్ల బడ్జెట్ ను తీసుకోవడంతో.. అప్పట్లో సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక దీనికి తోడు కరోనా మహమ్మారితో సినిమా విడుదలలో కూడా తీవ్ర జాప్యం చేసుకుంది. ఈ తరుణంలో విడుదలైన చిత్రం బాక్సీఫీసు వద్ద ఎలా సవ్వడి చేస్తోందా.? అన్న ప్రశ్నలకు అన్ లాక్ తరువాత అత్యధిక కలెక్షన్లు రాబట్టిన తొలి చిత్రంగా ఉప్పెన రికార్డును నమోదు చేసుకుంది.
ఇక దీంతో పాటు హీరో తెరంగ్రేటం చేయడంతోనే సాధించిన అత్యధిక వసూళ్ల రికార్డు కూడా బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ పేరు నుంచి వైష్ణవ్ తేజ్ పేరున లిఖించేలా చేసింది. లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో కృతిశెట్టి, విజయ్ సేతుపతి, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో నటించారు. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్లస్ పాయింట్ అయింది. ఇక ఈ చిత్రం తొలి పక్షం రోజుల వ్యవధిలో ఏకంగా ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల రూపాయల చేరువలో గ్రాస్ రాబట్టింది.
ఇక గత 15 రోజులుగా మొత్తంగా
నిజాం: రూ .14.15 కోట్లు
సీడెడ్: రూ .7 కోట్లు
వైజాగ్: రూ 8 కోట్లు
గుంటూరు: రూ. 2.75 కోట్లు
తూర్పు: రూ. 4.6 కోట్లు
పశ్చిమ: రూ. 2.45 కోట్లు
కృష్ణ: రూ. 2.9 కోట్లు
నెల్లూరు: రూ. 1.6 కోట్లు
ఏపీ, తెలంగాణ: రూ .43.45 కోట్లు షేర్ తో పాటు
ప్రపంచవ్యాప్తంగా 46.95 షేర్ సాధించింది.
ఇక ఈ సందర్భంగా వైష్ణవ్ తేజ్. కృతి శెట్టి.. ఉప్పెన చిత్ర యూనిట్ తో కలసి ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఉప్పెన టీంతో పాటు హీరోహీరోయిన్లు కూడా కాలినడకన తిరుమల శ్రీవారి కొండను ఎక్కి.. స్వామివారిని దర్శించుకున్నారు. ఇక వారు కొండెక్కుతుండగా అదే మార్గంలోని భక్తులు తీసిన వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more