Rashi Khanna to romance with Naga Chaitanya రాశీఖన్నాతో మరోసారి జతకడుతున్న నాగచైతన్య

Rashi khanna to romance with naga chaitanya for the third time

Rashi Khanna, Naga Chaitanya, Thank You, Pakka Commercial, Vikram Kumar, Maruti, Manam, Venky mama, Kollywood, Tollywood, movies, entertainment

Rashi Khanna to romance with Naga Chaitanya for the third time after manam and venky mama. In the latest movies she shares the screen with another two heroines in the Vikram Kumar movie with a hockey backdrop.

రాశీఖన్నాతో మరోసారి జతకడుతున్న నాగచైతన్య

Posted: 04/03/2021 03:15 PM IST
Rashi khanna to romance with naga chaitanya for the third time

అక్కినేని నాగచైతన్య.. మరోమారు టాలీవుడ్ అందాల బామ రాశీ ఖన్నాతో జతకడుతున్నాడు. మజలీ చిత్రంలో క్రికెటర్ అవతారమెత్తిన నాగచైతన్య.. విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న 'థాంక్యూ' చిత్రంతో హాకీ ప్లేయర్‌గా కనిపిస్తాడు. అలాగే ఇందులో మూడు గెటప్స్‌లో అభిమానులను మెప్పించడానికి సిద్ధమయ్యాడు చైతు. లేటెస్ట్‌ సినీ వర్గాల సమాచారం మేరకు 'థాంక్యూ' సినిమాలో ముగ్గురు హీరోయిన్స్‌తో నాగచైతన్య జోడీ కట్టనున్నాడు.

అయితే అందులో ఓ హీరోయిన్ మాత్రం తెల్లమందారంలాంటి అమాయక చూపుల రాశీఖన్నా. ఇది వరకే వీరిద్దరూ 'వెంకీమామ' మూవీలో జంటగా నటించి అలరించారు. అలాగే మనం సినిమాలోనూ చైతన్య ప్రియురాలి పాత్రలో రాశీఖన్నా గెస్ట్‌ అప్పియరెన్స్‌ ఇచ్చింది. మనం, వెంకీమామ చిత్రాల్లో మెప్పించిన ఈ జోడీ హ్యాట్రిక్ చిత్రంలోనూ జోడీ కట్టబోతోంది. ప్రస్తుతం ఆమె కోలీవుడ్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు తమిళ సినిమాలు ఉన్నాయి.

తెలుగులో రాశి ఖన్నా ఒక సినిమాకి మాత్రమే సైన్ చేసినట్టు తెలుస్తోంది. అదే మారుతి సినిమా .. దాని పేరే 'పక్కా కమర్షియల్'. గోపీచంద్ హీరోగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా తరువాత ఆమె మరో సినిమా కూడా అంగీకరించినట్టుగా తెలుస్తోంది. అదీ .. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో. నాగచైతన్య కథానాయకుడిగా 'దిల్' రాజు బ్యానర్లో నిర్మితమవుతున్న ఈ సినిమా, ఆల్రెడీ షూటింగు జరుపుకుంటోంది. త్వరలోనే ఆమె పేరును అధికారికంగా ప్రకటిస్తారని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rashi Khanna  Naga Chaitanya  Thank You  Pakka Commercial  Vikram Kumar  Maruti  Tollywood  

Other Articles