యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రూపోందుతున్న భారీ బడ్జెట్, మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్ ‘రౌద్రం, రణం, రుధిరం’. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం నుంచి ఎన్టీఆర్ అభిమానులకు ఓ చక్కని ట్రీట్ లభించింది. నందమూరి తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన ఫ్యాన్స్ కు మంచి కానుకను అందిస్తామని చెప్పిన మూవీ యూనిట్ అన్నట్లుగానే ఇవాళ ఆయన జన్మదిన వేడుకను పురస్కరించుకుని కొత్త లుక్ ను విడుదల చేసింది. ఇప్పటివరకు విడుదల చేసిన రామ్, భీమ్ వీడియోలు రికార్డ్ స్థాయి వ్యూస్ సాధించాయి..
ఈ చిత్రంలో గోండు బెబ్బులి కొమరం భీమ్ పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కనిపించనున్నారు. ఆ పాత్రకు సంబంధించి తారక్ కొత్త లుక్ ను రిలీజ్ చేసిన చిత్ర బృందం ఆయన ఫ్యాన్స్ కు కానుకను అందించారు. దర్శకధీరుడు ఎన్టీఆర్ కొత్త లుక్ ను ఇవాళ ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన భీమ్ కు బంగారం లాంటి మనసు ఉంది.. అదే ఆయన ఎదురుతిరిగితే ఎంతో ధృఢంగా, ధైర్యంగా నిలుస్తాడన్ని రాజమౌళి ట్విట్టర్ లో పేర్కొన్నారు. కొమరం భీమ్ నీటిలోంచి ఎగురుతూ బల్లెం విసురుతున్న పోస్టర్ అదిరిపోయింది.
కాగా, బాహుబలి సినిమాల తర్వాత రాజమౌళి రూపొందిస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో కొమురం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ను ఒక్కొక్కటిగా వదులుతూ రాజమౌళి ప్రేక్షకుల్లో అంచనాలను మరింత పెంచుతున్నారు.ఎన్టీఆర్ కళ్లల్లో ఫైర్ ఆకట్టుకుంటోంది.. తారక్‌కు జోడీగా ఒలివియా మోరిస్ కనిపించనుంది. పలుమార్లు వాయిదాల తరువాత ఈ ఏడాది దసరాకు విడుదల కావాల్సిన చిత్రం కరోనా రెండో దశ కారణంగా మళ్లీ వాయిదా పడనుందన్న టాక్ వినిపిస్తోంది.
Wishing u many more happy returns of the day #YoungTiger @tarak9999 annaiah Eppudo metho chinnapudu #Simhadri lo act chesa Malli eppuda ani wait chesthunna#KomaramBheem #RRRMovie@ssrajamouli @AlwaysRamCharan @ajaydevgn @aliaa08 @oliviamorris891 @RRRMovie @DVVMovies pic.twitter.com/P9p2MIOCZJ
— Master Mahendran (@Actor_Mahendran) May 20, 2021
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more