Ravi Teja’s Khiladi Recommences Its Shoot ఖిలాడి కోసం సెట్లోకి వెళ్తున్న మాస్ మహారాజ.!

Ravi teja ramesh varma satyanarayana koneru s khiladi shooting resumes on july 26

Ravi Teja, Ramesh Varma, Meenakshi Chaudhary, Dimple Hayathi, khiladi, dual role, Satyanarayana Koneru, DeviSri Prasad, Vennela Kishore, corona second wave, coronavirus lockdown, Tollywood, movies, Entertainments

Ravi Teja’s much-awaited upcoming film 'Khiladi,' will be the one of the few films to resume work on July 26. The film’s team was waiting for the Covid-19 restrictions to be lifted, and now it seems the team has resumed shoot. Director Ramesh Varma took to his Twitter and shared that the movie team is now set to resume shoot in Hyderabad.

ఖిలాడి కోసం సెట్లోకి వెళ్తున్న మాస్ మహారాజ.!

Posted: 07/24/2021 08:11 PM IST
Ravi teja ramesh varma satyanarayana koneru s khiladi shooting resumes on july 26

మాస్ మహారాజ రవితేజ కథానాయకుడిగా 'ఖిలాడి' సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. రమేశ్ వర్మ దర్శకత్వంలో ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. చిత్రంలో కొన్ని కీలకమైన ఘట్టాలు మినహా చిత్రం దాదాపుగా పూర్తైన తరుణంలో చిత్రం షూటింగ్ పై పలు కథనాలు తెరపైకి వచ్చాయి. చిత్రం షూటింగు ఆగిపోయినట్టు.. సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల తన డేట్స్ వేస్ట్ అవుతున్నాయనే అసహనాన్ని రవితేజ వ్యక్తం చేసినట్టుగా కథనాలు ప్రచురితం అయ్యాయి.

కాగా, అలాంటి ప్రచారానికి తెరదించేస్తూ ఈ సినిమా బృందం ఒక పోస్టర్ ను వదిలింది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ఈనెల 26వ తేదీ నుంచి ప్రారంభం కానుందనే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ చిత్రం షూటింగ్ పై వినిపించిన పలు గుసగుసలు పటాపంచలై కోట్టుకుపోయాయి. డిఫరెంట్ లుక్ తో రవితేజ కనిపించనున్న ఈ చిత్రంలో, ఆయన సరసన నాయికలుగా మీనాక్షి చౌదరి .. డింపుల్ హయతి కనువిందు చేయనున్నారు.
 
దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, దసరా బరిలో నిలిపే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా తరువాత ప్రాజెక్టుగా రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' రూపొందుతోంది. శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. మొత్తానికి దసరా, సంక్రాంతి తన సినిమాలను లైన్టో పెట్టిన రవితేజ.. ఆ తరువాత ఉగాదికి కూడా మరో చిత్రంతో రావాలని ప్లాన్ చేస్తున్నారని టాక్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles