ప్రేమకావాలి, ‘లవ్లీ, ‘సుకుమారుడు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటుడు ఆది తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ఎంతగానో కృషి చేస్తున్నాడు. విలక్షణమైన కథలు ఎంచుకుంటూ.. ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాడు ఆది. ఆ మధ్యకాలంలో వచ్చిన ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ రీసెంట్గా వచ్చిన ‘శశి’ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో కథల ఎంపికలో మరోసారి జాగ్రత్త పడతున్నాడు. వరుస సినిమాలను లైన్లో పెట్టిన సాయి కుమార్ తనయుడు ఆది సాయికుమార్ ఈ మధ్య తన దూకుడు పెంచినట్టుగానే కనిపిస్తోంది.
'అమరన్', 'కిరాతక', 'బ్లాక్' సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయి. ఒకదానితో ఒకటి ఎంతమాత్రం సంబంధంలేని కథలను ఆయన చేస్తూ వెళుతున్నాడు. బ్లాక్ చిత్రాన్ని దర్శకుడు జీబీ కృష్ణ రూపోందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఇది మాత్రం ఆది కెరీర్ లో వచ్చిన సినిమాల్లో మంచి ఆసక్తికరంగా ఉందని చెప్పాలి. థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుందని టీజర్‌ని బట్టి అర్దమవుతుంది.
టీజర్లో ఆది చెప్పే డైలాగ్స్ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. సురేష్ బొబ్బిలి మ్యూజిక్ కూడా ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది. మొత్తానికి మాత్రం ఈ సినిమాని మంచిగా ప్రమోట్ చేసి వదిలితే ఆది కెరీర్ లో మంచి హిట్ గా నిలవొచ్చు. ఈ చిత్రంలో ఆది సరసన దర్శన హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం అతను ‘అమరన్ ఇన్ ది సిటీ చాప్టర్-1’అనే సినిమాలో నటిస్తున్నాడు. ఆది కెరీర్లోనే ఇది భారీ బడ్జెట్ సినిమా కావడం విశేషం. ఎస్.బాలవీర్ రచన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఎస్వీఆర్ నిర్మిస్తున్నారు. అవికా గోర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో ఆది తండ్రి సాయి కుమార్ ఓ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more