పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - పాన్ ఇండియా నటుడు రానా దగ్గుబాటి కలసి నటిస్తున్న తొలి చిత్రం 'భీమ్లా నాయక్'. సాగర్ చంద్ర కాంబినేషన్లో రూపోందుతున్న ఈ చిత్రం మలయాళంలో భారీ విజయాన్ని అందుకున్న 'అయ్యప్పనుమ్ కోషియుమ్' సినిమాకి రీమేక్ అయినా పవన్-రానా జోడీగా వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ చిత్రంపై అటు మెగా ఫాన్స్, ఇటు దగ్గుబాటి అభిమానుల్లోనూ అంచనాలు పెరిగిపోయాయి. ఇక దీనికి తోడు ఇటీవల విడుదలైన స్నీక్ పీక్ కూడా అభిమానులను ఆకట్టుకోవడంతో పాటు చిత్రంపై అంచనాలను మరింత పెంచింది. పోలీస్ ఆఫీసర్ గా పవన్ కల్యాణ్ నటిస్తున్న ఈ సినిమాలో, రానా మరో ప్రధానమైన పాత్రను పోషిస్తున్నాడు.
పవన్ సరసన నిత్యామీనన్ నటిస్తుండగా, రానా జోడీగా ఐశ్వర్య రాజేశ్ కనిపించనుంది. చిత్రీకరణ పరంగా చివరిదశకు చేరుకున్న ఈ సినిమాకి, తమన్ సంగీతాన్ని అందించాడు. ఫస్టు సింగిల్ ను పవన్ పుట్టినరోజున వదలాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక ఈ సినిమా ఆడియో హక్కులను ప్రముఖ ఆడియో సంస్థ భారీ రేటుకు కొనుగోలు చేసినట్టుగా చెబుతున్నారు. ఇందుకోసం వారు 5.04 కోట్లు చెల్లించినట్టుగా తెలుస్తోంది. డ్యూయెట్లు పెద్దగా లేనప్పటికీ, సందర్భానుసారం వచ్చే పాటలు ఆకట్టుకునేలా ఉంటాయని అంటున్నారు. జనవరి 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more