Naga Shaurya's 'Varudu Kaavalenu' gets U/A certificate కత్తెరింపులు దాటుకున్న నాగశౌర్య, రీతువర్మల ‘వరుడు కావలెను’

Naga shaurya ritu varma stared varudu kaavalenu gets u a certificate

Varudu Kaavalenu, Naga Shaurya, Ritu Varma, Lakshmi Sowjanya, Vishal Chandrashekhar, U/A,October 29, Censor Board, Suryadevara Naga Vamsi, Sithara Entertainments, Entertainment News, Telugu Movies News, Tollywood News, tollywood, Moives, Entertainment

'Varudu Kaavalenu' has been cleared by the CBFC. The makers had submitted the film at the CBFC for clearance. A U/A certificate was given to the film on October 21. Directed by Lakshmi Sowjanya, the film features Naga Shaurya and Ritu Varma in the lead roles.

కత్తెరింపులు దాటుకున్న నాగశౌర్య, రీతువర్మల ‘వరుడు కావలెను’

Posted: 10/21/2021 05:53 PM IST
Naga shaurya ritu varma stared varudu kaavalenu gets u a certificate

నాగశౌర్య హీరోగా 'వరుడు కావలెను' చిత్రం రూపోందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించిన చిత్రబృందం పోటీ అధికంగా వుండటంతో మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు మిస్ కాకుడదని..ఓ వారం రోజుల ముందుగానే థియేటర్లకు తీసుకువస్తున్నారు. దీంతో ఈ చిత్రం ఈ నెల 29నే విడుదల కానుంది. ఈ చిత్రంలో నాగశౌర్య సరసన పెళ్లి చూపులు ఫేమ్ రీతూశర్మ హీరోయిన్ గా నటించారు.

సితార ఎంటర్ టైనర్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఈ రోమాంటిక్ చిత్రానికి లక్ష్మీసౌజన్య దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో హాస్యాన్ని మరింత జోడించడానికి వెన్నెల కిషోర్ పాత్ర కీలకంగా మారనుంది. నదియా, మురళీ శర్మ, ప్రవీణ్, హర్షవర్థన్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. చిత్రానికి సంగీతాన్ని విశాల్ చంద్రశేఖర్ సమకూర్చారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని, U/A సర్టిఫికెట్ ను తెచ్చుకుంది.

ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాకి తమన్ - విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందించారు. ఇంతవరకూ వదిలిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఇటు యూత్ కి .. అటు ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే  కంటెంట్ తో ఈ సినిమా రానుంది. నదియా పోషించిన పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. మురళీ శర్మ .. వెన్నెల కిషోర్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాతో నాగశౌర్యకి హిట్ పడుతుందేమో చూడాలి.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles