వరుణ్ తేజ్ కథానాయకుడిగా బాక్సింగ్ నేపథ్యంలో 'గని' సినిమా రూపొందింది. అల్లు బాబీ - సిద్ధు ముద్ద సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి, కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించాడు. వరుణ్ తేజ్ ఈ సినిమా కోసం విదేశాలకు వెళ్లి మరీ బాక్సింగ్ లో శిక్షణ తీసుకుని వచ్చాడు. అన్నిరంగాలతో పాటు చిత్రరంగంపై కూడా విరుచుకుపడిన కరోనా మహమ్మారి కారణంగా చిత్ర సినిమా షూటింగ్ లో తీవ్ర జాప్యం ఏర్పడింది. లేని పక్షంలో ఈ పాటీకి సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సింది.
అయితే రెండో దశ అన్ లాక్ తరువాత కరోనా ప్రభావం తగ్గుతూ ఉండగానే కోవిడ్ ప్రమాణాలను పాటిస్తూ.. అత్యంత జాగ్రత్త చర్యలు తీసుకుంటూ షూటింగ్ చేయడంతో ఎట్టకేలకు ఈ చిత్రం షూటింగ్ ఇవాళ్టికి పూర్తైయ్యింది. దీంతో చిత్రబృందం షూటింగు పార్టుకు గుమ్మడికాయ కొట్టేశారు. బాక్సింగ్ నేపథ్యంలో సాగుతున్న ఈ చిత్రం ఆత్యందం ప్రేక్షకులను ఆకట్టుకునేలా కమర్షియల్ ఎలిమెంట్స్ జోడింగ్ రక్తకట్టించే సీన్లను జోడించారని సమాచారం.
ఈ సినిమాతో సయీ మంజ్రేకర్ తెలుగు తెరకి కథానాయికగా పరిచయం కానుంది. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ నిన్నటి తరం హీరో, నటుడు సునీల్ శెట్టితో పాటు కన్నడ హీరో ఉపేంద్ర, జగపతిబాబు.. నవీంచంద్ర ముఖ్యమైన పాత్రలను పోషించారు. పూర్తిగా స్పోర్ట్స్ డ్రామా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎస్ తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. కాగా ఈ సినిమాను డిసెంబర్ 3వ తేదీన విడుదల చేయనున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more