నిత్యామీనన్ దక్షిణాదిలో మంచిక్రేజ్ ఉన్న హీరోయిన్. అందం, అభినయం అమె సోంతం. తన చిరుమందహాసం, తనలోని భావిన్ని తెలిపే కళ్లతోనే అమె కుర్రాళ్లను కట్టిపడేసింది. ఈ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఎక్కడా కూడా ఆమె ఎక్స్ పోజింగ్ కు చాన్స్ ఇవ్వకుండా.. తన నాచురల్ అందంతోనే స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. సహజ నటిగా సాయిపల్లవికి ముందు వినిపించిన పేరు నిత్యామీనన్. అయితే ఈ మధ్య కాసింత బొద్దుగా తయారుకావడంతో అమెకు సినిమా ఛాన్సులు సన్నగిల్లాయి.
అయితే ప్రస్తుతం అమె ప్రాణ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో ఓ కామియో రోల్ కు ఎవర్ని చేర్చుకుందామా.? అని అలోచించిన అమెకు.. తనతో పాటే కెరీర్ ను ప్రారంభించిన నాచ్యురల్ స్టార్ నాని గుర్తుకు వచ్చాడు. అలా మొదలైంది చిత్రంతో వీరిద్దరూ తమ కెరీర్ ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా, ప్రాణ చిత్రంలో నాని కామియో రోల్ చేయడానికి అంగీకరించడంతో ఆయన రుణాన్ని కూడా నిత్య మీనన్ త్వరలోనే తీర్చుకోనుంది. అదేలా అంటే ఈ డీటైల్స్ లోకి వెళ్లాల్సిందే. నాని, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా దసరా చిత్రం రూపోందుతున్న విషయం తెలిసిందే.
అయితే ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించేందుకు నటి అవసరం పడింది. దీంతో నాని.. నిత్యను సంప్రదించగా, అమె అంగీకరించింది. దీంతో నాని రుణాన్ని త్వరగానే తీర్చేసుకుంది నిత్య. ఇంతకీ ఆ సినిమా పేరేంటో తెలుసా.? 'దసరా'. నాని కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాకి, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా కీర్తి సురేశ్ ను తీసుకున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'నేను లోకల్' విజయాన్ని సాధించింది. మళ్లీ ఇప్పుడు ఈ కాంబినేషన్ సెట్ అయింది. ఈ సినిమాలో ముఖ్యమైన గెస్టు రోల్ కోసం నిత్యామీనన్ ను తీసుకున్నారు. ఆమె కెరియర్ నాని సినిమా 'అలా మొదలైంది'తో మొదలైందనే సంగతి తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more