Newly wed Karthikeya Couple Visits Tirupati Srivaru తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న కార్తికేయ దంపతులు

Newly wed karthikeya couple visits tirumala lord venkateshwara swamy

Young Hero Karthikeya, Karthikeya Gummakonda, Lohitha Reddy, Newly Wed couple, Karthikeya lohitha, Tirumala Tirupati, Tirumala darshan, Tirumala srivari darshanam, Tirumala Lord Venkateswara Swamy, Kathikeya wedding, Tollywood, Movies, Entertainment

Tollywood actor Karthikya Gummakonda along with his wife Lohitha Reddy visited Tirumala and offered special prayers to the Lord Venkateswara Swamy on Friday. It is known that RX100 fame Karthikeya got married to his girlfriend Lohita Reddy on November 21 and now the internet is getting a buzz with the pictures of Karthikeya's wedding ceremony.

తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న కార్తికేయ దంపతులు

Posted: 11/26/2021 05:01 PM IST
Newly wed karthikeya couple visits tirumala lord venkateshwara swamy

హీరో కార్తికేయ తన వరకు అన్ని విషయాల్లోనూ కాస్త తోందరగానూ.. సమయానుకూలంగానూ చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు. హీరో కాకుండానే తన లవ్ స్టోరీని కంటిన్యూ చేస్తూ వచ్చిన కార్తీకేయ.. ఇక అటు హీరోగానూ.. ఇటు ప్రతినాయకుడిగానూ పలు చిత్రాలలో నటిస్తున్నాడు. ఈ క్రమంలో లభించిన కొద్ది సమయాన్ని కూడా పూర్తిగా యుటిలైజ్ చేసుకునేలా ప్లాన్ చేసుకున్నాడు. అంతే తన చిన్ననాటి ప్రియురాలు లోహితా రెడ్డిని వివాహం చేసుకున్నాడు. చిన్ననాటి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానిగా అయన చిత్రాలను చూస్తూనే పెరిగిన ఈ నటుడి వివాహానికి చిరంజీవి కూడా వెళ్లి వధూవరులను మనసారా అశీర్వదించి వచ్చారు.

ఇక ఇంటివాడైన హీరో కార్తీకేయ తన ప్రియురాలు లోహితా రెడ్డితో కలసి తొలిసారిగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధికి వచ్చారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ఆలయంలోని శ్రీవారిని దర్శించుకున్న ఈ నూతన జంట.. స్వామివారికి ప్రత్యేక పూజలను కూడా నిర్వహించారు. దర్శనం అనంతరం వేదపండితుల ఆశీర్వాదం పొందారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందుకున్న ఈ జంటను టీటీడీ ఆలయ అధికారులు సత్కరించారు. ఇక ఆలయం బయటకు వచ్చిన కార్తీకేయను అభిమానులు చుట్టుముట్టి సెల్పీలు, అటోగ్రాప్ లతో ఉక్కిరిబిక్కిరి చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles