యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ భారతీయ సినిమా చరిత్రలోనే టాప్ హీరోగా నిలిచాడు. బాహుబలి సిరీస్ చిత్రాలతో పాటు సాహో చిత్రం ఆయనను అఖిలభారత ప్రేక్షకులకు చేరువ చేసింది. ప్రస్తుతం యావత్ భారతీయ సినీ చరిత్రలోనే ఎవరూ తీసుకోనంత రెన్యూమరేషన్ ఆయన ఒక్కో చిత్రానికి తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఒక్కో చిత్రానికి ఏకంగా రూ. 150 కోట్లు తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. ఆయన నటించిన తాజా చిత్రం 'రాధే శ్యామ్' సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది.
రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను జనవరి 14వ తేదీన థియేటర్లకు తీసుకురానున్నారు. ఇక ఆ తరువాత ప్రాజెక్టుగా ఆయన 'ఆది పురుష్' సినిమాను కూడా పూర్తిచేశాడు. ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణ ఇతివృత్తంతో ఈ సినిమా రూపొందింది. ఇక ఈ సినిమా తరువాత ప్రభాస్ 'సలార్' పైన పూర్తి దృష్టి పెడతాడనీ, ఈ సినిమా పూర్తయిన తరువాత తన 21 చిత్రంగా రూపోందనున్న 'ప్రాజెక్టు K' పైకి వెళతాడని అంతా అనుకున్నారు.
అయితే సలార్ షూటింగ్ షెడ్యూల్ లో వచ్చిన గ్యాప్ లో ప్రాజెక్ట్ కే తొలి షెడ్యూల్ పూర్తి చేసేలా రెబల్ స్టార్ ప్లాన్ చేశారు. ఈ క్రమంలో వచ్చేనెల 2వ తేదీ నుంచి ప్రభాస్ 'ప్రాజెక్టు K' సెట్స్ పైకి వెళ్లనున్నట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది. ఆ రోజున ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ ను మొదలుపెడుతున్నారట. 'ప్రాజెక్టు K' ఫస్టు షెడ్యూల్ పూర్తయిన తరువాతనే, ప్రభాస్ తిరిగి 'సలార్' షూటింగులో పాల్గొంటాడట. అక్కడి నుంచి ఆ సినిమా పూర్తయ్యేంతవరకూ దానిపైనే ఉంటాడని అంటున్నారు. మొత్తానికి ప్రభాస్ పక్కా ప్లానింగ్ తోనే దూసుకుపోతున్నాడు. ఇక లైన్లో సందీప్ రెడ్డి వంగా ఉన్న సంగతి తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more