మెగాస్టార్ చిరంజీవి.. మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో కలసి నటిస్తున్న చిత్రం ఆచార్య. అన్ని సినిమాల మాదిరిగానే ఈ చిత్రంపై కూడా కరోనా ప్రభావం తీవ్రంగానే పడింది. అనేక బ్రేకులు మధ్య కొనసాగిన ఈ సినిమా షూటింగ్ మొత్తానికి తుది అంకానికి చేరుకుని పోస్టు ప్రోడక్షన్స్ పనులలో వుంది. ఇక ఇదే సమయంలో ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 4న విడుదల చేస్తామని ఇదివరకే ప్రకటించిన చిత్ర యూనిట్.. దీంతో అటు ప్రమోషన్స్ వర్క్ కూడా జరుపుకునే పనిలో ఉంది. ఇందులో భాగంగా చిత్రబృందం ముందస్తుగా చెప్పినట్లుగానే ఇవాళ సానా కష్టం లిరికల్ వీడియోను విడుదల చేసింది.
సంగీత దర్శకుడు మణిశర్మ- మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్‌కు టాలీవుడ్ అదిరిపోయే క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. మరోలా చెప్పాలంటే మణిశర్మ బీట్లకు చిరంజీవి డాన్స్ మూవ్ మెంట్స్ కలిసి ధియేటర్లలో అభిమానులచేత ఈలలు వేయించడం.. కెవ్వుకేకలు పెట్టించడం పరిపాటిగా మారిన విషయం కూడా తెలిసిందే. అయితే తాజాగా అచార్య చిత్రంతో ఈ కాంబినేషన్ మధ్య అదిరిపోయే కాంపిటీషన్ కూడా మళ్లీ ఏర్పడనుందన్న విషయం ఈ లిరికల్ వీడియోతో తేటతెల్లం అవుతోంది. ‘ఆచార్య’ చిత్రంలో చిరు అభిమానులకు మరోమారు పండగ వాతావరణాన్ని తీసుకురానుందని కూడా ఫిక్స్ అయ్యింది.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని ‘లాహే లాహే’, ‘నీలాంబరి’ పాటలు విశేషంగా అలరించాయి. ఇప్పుడా జాబితాలోకి మరో హుషారైన గీతం చేరింది. ఈ సినిమాలోని ‘సానా కష్టం వచ్చిందే మందాకినీ’ అనే స్పెషల్ సాంగ్ లిరికల్ వీడియోను సినీయూనిట్ ఇవాళ విడుదల చేసింది. మణిశర్మ సంగీతం, చిరంజీవి స్టెప్పులు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. మణిశర్మ మ్యూజిక్ మ్యాజిక్ కు చిరంజీవి డాన్స్ మూవ్ మెంట్లు చాలా రోజుల తరువాత మళ్లి జతకలిసింది. ఈ పాటలో చిరుకి జోడీగా రెజీనా సందడి చేసింది. భాస్కరభట్ల రవికుమార్ రచించిన ఈ పాటను రేవంత్, గీతామాధురి ఆలపించారు.
దేవాదాయ శాఖ నేపథ్యంలో కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి తనయుడు, నటుడు రామ్‌చరణ్.. సిద్ధ అనే కీలక పాత్ర పోషించారు. చిరుకు జోడీగా కాజల్, చరణ్‌కు జంటగా పూజాహెగ్డే నటించారు. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడెక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా ఫిబ్రవరి 4న విడుదలకానుంది. ఇందులో చిరు సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. నిరంజన్ రెడ్డి దీనికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తుండగా.. తిరు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more