తెలుగు చిత్రసీమలో రాహుల్ రామకృష్ణ.. కమెడియన్‌గా, నటుడిగా తనేంటో నిరూపించుకున్నాడు. తనకంటూ ప్రత్యేకంగా అభిమానులను సంతరించుకున్నారు. అర్జున్ రెడ్డి, భరత్ అనే నేను చిత్రాలతో తన క్యారెక్టర్ నటనకు కూడా నూటికి నూరుపాళ్లు న్యాయం చేసిన ఆయన అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురంలో’, నవీన్ పోలిశెట్టి 'జాతిరత్నాలు' సినిమాతో తన మార్కు కామెడీతో క్రేజ్ సంపాదించుకున్నారు. తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్రంలోనూ నటిస్తున్న ఆయన గత రాత్రి అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఇకమీదట సినిమాల్లో నటించనని వెల్లడించాడు. 2022 వరకు మాత్రమే సినిమాల్లో నటిస్తానని, ఆ తర్వాత నటనకు దూరం అవుతానని ట్విటర్ వేదికగా ప్రకటించాడు. ఎవ్వరేమన్నా తను ఇదే నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నాడు. ఇలా ఉన్నట్టుండి ఎందుకు సినిమాలు మానేస్తున్నాడని అభిమానులు తలలు పట్టుకుంటున్నారు.
'ఇదంతా ప్రాంక్ కదా', 'నిజం చెప్పు రాహుల్', 'ఇదేదో వెబ్‌సిరీస్ ప్రమోషన్ అయ్యుంటుంది', 'నావల్ల ప్రాబ్లమ్ అయితే నేను వెళ్లిపోతా మామా.. అన్న డైలాగ్‌ను నిజం చేయట్లేదుగా' అని రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కాగా 'జయమ్ము నిశ్చయమ్మురా' సినిమాతో తెరంగేట్రం చేసిన రాహుల్ 'అర్జున్ రెడ్డి'లో విజయ్ దేవరకొండ స్నేహితుడి పాత్రలో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత 'జాతిరత్నాలు', 'కల్కి', 'స్కైలాబ్' చిత్రాల్లోనూ నటించి మెప్పించాడు. ఈ ఏడాదితో తన యాక్టింగ్ కెరీర్‌కు ఎందుకు ఫుల్స్టాప్ పెడుతున్నాడనేది తెలియాల్సి ఉంది. కాగా, ఆయన త్వరలోనే చిత్రసీమలో డైరెక్టర్ గా మారనున్నారని, ఈ విషయాన్ని త్వరలోనే అధికారికంగా తెలియజేయనున్నారని సమాచారం.
2022 is my last.
— Rahul Ramakrishna (@eyrahul) February 4, 2022
I will not do films anymore.
Not that I care, nor should anybody care
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more