బాలీవుడ్ పరిశ్రమలో మరో దృవతార తిరిగిరాని లోకాలకు తరలివెళ్లడంతో విషాదం అలుముకుంది. ఇటీవల సుప్రసిద్ద గాయని లతాజీ మరణంతో అలుముకున్న విషాదం నుంచి తేరుకునేలోపు మరో ప్రముఖడు పరమపదించారు. తన సంగీతఝరిలో భారతదేశంతో పాటు ప్రపంచంలోని అనేకమంది సంగీతప్రియులను మంత్రముగ్దుల్ని చేసి.. అబాల గోపాలాన్ని ఒలలాడించడంతో పాటు తన ట్యూన్ లకు స్టెప్పులేయించిన సంగీత సామ్రాట్ బప్పిలహరి (69) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అసుపత్రిలో చికిత్స పోందుతూ తుదిశ్వాస విడిచారు. ఒంటినిండా బంగారంతో ప్రత్యేకంగా కనిపించే బప్పి.. 1980, 90వ దశకాల్లో తన డిస్కో మ్యూజిక్‌తో భారతీయ సినీపరిశ్రమను ఒక ఊపు ఊపేశారు. ఆయన ఆలపించిన 'చల్తే చల్తే', 'డిస్కో డ్యాన్సర్', 'షరాబీ' వంటి గీతాలను యువతను ఉర్రూతలూగించాయి.
1952, నవంబర్ 27న బెంగాల్ లోని జల్పాయ్ గురిలో జన్మించిన బప్పి లహిరి.. బాలీవుడ్లో 50కి పైగా చిత్రాలకు సంగీతం సమకూర్చారు. బాలీవుడ్ చిత్రసీమతో పాటు పలు బాషా చిత్రాలకు కూడా సంగీత దర్శకత్వం వహించారు. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, గుజరాతీ భాషల్లో సంగీతం అందించారు. 2014లో భారతీయ జనతా పార్టీ (బీజేపి)లో చేరిన ఆయన అదే ఏడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బెంగాల్ నుంచి ఎంపీగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. తెలుగులో ఇటీవల డిస్కోరాజా చిత్రంలో కూడా పాటపడారు. కాగా, హిందీలో 2020లో విడుదలైన బాఘీ 3 సినిమాలో తన చివరి పాట పాడారు.
ఇటు తెలుగు సినీ ప్రేక్షకులకు కూడా ఆయన సుపరిచితుడు. సూపర్ స్టార్ కృష్ణ నటించిన సింహాసనం చిత్రానికి ఆయనే సంగీత దర్శకత్వం వహించారు. దీంతో ఆసినిమాతో పాటు చిత్రంలోని పాటలు కూడా సూపర్ గా హిట్ అయ్యాయి. ఇప్పటికీ ఆ పాటలు సంగీత ప్రియుల మదిని నుంచి వదిలిపోవంటే అతిశయోక్తి కాదు. ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి నటించిన స్టేట్ రౌడీ, గ్యాంగ్ లీడర్, బిగ్ బాస్ చిత్రాలతో పాటు బాలకృష్ణ నటించిన నిప్పురవ్వ, ఖైదీ ఇన్ స్పెక్టర్, సామ్రాట్, మోహన్ బాబు నటించిన రౌడీ గారి పెళ్లాం, బ్రహ్మ, దొంగ పోలీసు చిత్రాలకు కూడా ఆయననే సంగీత దర్శకత్వం వహించారు.
ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పి లహిరి మృతి పట్ల పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు సంతాపం తెలిపారు. సామాజిక మాధ్యమాల ద్వారా బప్పితో తమకున్న అనుబంధాన్ని తెలుపుతున్నారు. ప్రధాని నరేంద్రమోడీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, టాలీవుడ్ సినీ ప్రముఖులు చిరంజీవి, క్రీడా ప్రముఖులు యువరాజ్ సింగ్, సచిన్ టెండుల్కర్, హర్భజన్ సింగ్ సహా అనేక మంది ప్రముఖులు ఆయన మృతిపట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. బప్పితో తమకున్న అనుబంధాన్ని సోషల్‌మీడియాలో పంచుకుంటూ పోస్టులు పెట్టారు.
"అద్భుతమైన సంగీత దర్శకుడు బప్పి లహిరి ఆకస్మిక మరణం బాధాకరం. భారతదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ఆయన పాటలు విశేష ప్రేక్షకాదరణ పొందాయి. పాటల రూపంలో ఆయన ఎప్పటికీ అభిమానుల మదిలో నిలిచే ఉంటారు" -రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
"బప్పి లహిరి మరణం సంగీత ప్రపంచానికే తీరని లోటు. ఆయన కుటుంబానికి, అభిమానులకు సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి" - ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
"బప్పి లహిరి అందించిన సంగీతం ఎన్నో అందమైన భావోద్వేగాలను వ్యక్తీకరించింది. ఏ తరం వారైనా ఆయన సంగీతానికి మంత్రముగ్ధులు కావాల్సిందే. నేడు ఆయన ఆకస్మిక మరణం బాధాకరం. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి" - నరేంద్రమోదీ
"లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ బప్పి లహిరి ఆకస్మిక మరణం నన్ను ఎంతో కలచివేసింది. వ్యక్తిగతంగా ఆయనతో నాకు మంచి అనుబంధం ఉంది. నేను నటించిన పలు సినిమాలకు ఆయన చార్ట్‌బస్టర్ హిట్స్ అందించారు. ఆయన అందించిన సంగీతంతో నా సినిమాలకు ప్రేక్షకుల్లో మరింత పాపులారిటీ దక్కింది. ఎన్నో పాటల రూపంలో ఆయన ఎప్పటికీ చిరస్మరణీయులే" - చిరంజీవి
"మరో అద్భుతమైన గాయకుడిని సినీపరిశ్రమ కోల్పోయింది. నాతో సహా ఎన్నో లక్షల మంది డ్యాన్స్ చేయడానికి మీ స్వరమే కారణం. మీ మ్యూజిక్‌తో ఎంతో మందికి సంతోషాన్ని పంచినందుకు ధన్యవాదాలు. మీ కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి" -అక్షయ్‌కుమార్
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more