Samantha first-look in Shaakuntalam గుణశేఖర్ ‘శాకుంతలం’ నుంచి సమంత ఫస్ట్ లుక్ అదుర్స్.!

Samantha looks breathtaking in shaakuntalam first look poster

Samantha, Samantha shaakuntalam, shaakuntalam first look, shaakuntalam first look poster, samantha as shaakuntala, samantha ruth prabhu, samantha shaakuntalam poster, shaakuntalam, first look, shaakuntala, mythological drama, Guna Sekhar, Mani Sharma, Neelima Guna, Tollywood, Movies, Entertainment

Samantha is back in the news. This time, it is for her upcoming film, Shaakuntalam. The makers unveiled the first-look poster of Shaakuntalam today, February 21. Samantha looks ethereal in a white ensemble adorned with red flowers. She can be seen surrounded by a bunch of deer and a peacock. The mythological drama is directed by Gunasekhar.

గుణశేఖర్ ‘శాకుంతలం’ నుంచి సమంత ఫస్ట్ లుక్ అదుర్స్.!

Posted: 02/21/2022 05:03 PM IST
Samantha looks breathtaking in shaakuntalam first look poster

వైవిధ్య భ‌రిత క‌థ‌ల‌ను ఎంచుకుంటూ త‌న న‌ట‌న‌తో, అభినయంతో ప్రేక్ష‌కులలో విప‌రీత‌మైన క్రేజ్‌ను సంపాదించుకున్న న‌టి స‌మంత‌. దక్షిణాదిలో అగ్రస్థానాన్ని సంపాదించుకున్న ఈ నటి ఇప్పుడిప్పుడే అటు బాలీవుడ్ లోనూ అడుగుపెట్టేందుకు సిద్దమవుతోంది. ఈ క్రమంలో నటిస్తున్న తాజా చిత్రం పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతుండటం అమెకు కలిసివచ్చే అంశం. స‌మంత ఇప్ప‌టివ‌ర‌కు 45 సినిమాల‌కు పైగా న‌టించింది. ప్ర‌తి పాత్రలో ప‌లుర‌కాల వేరియేష‌న్స్ చూపిస్తూ సినీరంగంలో త‌నకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్ప‌ర‌చుకుంది. ఈమె ప్రాధాన పాత్ర‌లో న‌టిస్తున్న లేట‌స్ట్ చిత్రం ‘శాకుంత‌లం’. క్రియేటీవ్ జీనియ‌స్ గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం నుండి తాజాగా ఫ‌స్ట్ లుక్ పోస్టర్ విడుద‌లైంది.

మేక‌ర్స్ విడుద‌ల చేసిన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌లో స‌మంత అంద‌మైన‌ దేవ‌క‌న్య‌లా క‌నిపిస్తుంది. వ‌న్య ప్రాణులు చుట్టూ చేరి ఆ అందాన్ని క‌నుల‌తో స్ప‌ర్షిస్తున్న‌ట్లు పోస్ట‌ర్‌ను అద్భుతంగా మేక‌ర్స్ డిజైన్ చేశారు. ఇందులో ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ కుమార్తె అల్లుఅర్హ చిన్ననాటి శకుంతల దేవి పాత్రను కూడా పోషిస్తూ తెరంగ్రేటం చేస్తోన్న విషయం తెలిసిందే. దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో గుణ టీంవ‌ర్క్స్ బ్యానర్‌పై నీలిమాగుణ నిర్మిస్తుంది. అత్యంత భారీగా పాన్ ఇండియా చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం షూటింగ్ జ‌రుపుకుంటుంది. మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్ష‌కుల‌లో భారీ అంచ‌నాలున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles