Anasuya and Sunil 'Darja' teaser out సునీల్, అనసూయల ‘దర్జా’ టీజర్ లాంచ్

Leading producer d suresh babu launched darja movie teaser

Darja Teaser, Anasuya, Darja anasuya, Sunil, sunil anasuya, sunil Darja, kanakamahalakshmi anasuya, Suresh Babu, Kamineni Srinivas, Saleem Malik, Rap Rock Shakeel, Siva Sankar Paidipati, Tollywood movies, Entertainment

Anasuya selectively chooses only the roles that will bring her a good name. Recently, She rocked in a Movie ‘Darja’. Presented by ‘Kamineni Srinivas’, the upcoming fiction and action entertainer film ‘Darja’ starring Sunil and Anasuya under the banner of PSS Entertainments.

అనసూయా.. కాదు.. చీర కట్టిన శివంగీ: దర్జా టీజర్ ఔట్

Posted: 03/31/2022 06:58 PM IST
Leading producer d suresh babu launched darja movie teaser

బుల్లితెర యాంకర్​ అనసూయ భరద్వాజ్​కు రంగస్థలం చిత్రంలో రంగమ్మత్త పాత్ర చక్కని గుర్తింపును తీసుకువచ్చింది. ఇక ఆ తరువాత పలు చిత్రాల్లో నటించినా.. ఇటీవల విడుదలైన పుష్ఫ చిత్రంలో అమె నటించిన పాత్ర కూడా అమెను ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. అటు యాంకరింగ్‌తోపాటు అప్పుడప్పుడు సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో అలరిస్తూ తెలుగు ప్రేక్షకులలో తనదైన గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా చక్కని ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా సొంతం చేసుకుంది అనసూయ. ప్రస్తుతం అటు యాంకరింగ్ చేస్తూనే.. ఇటు సినిమాల్లోనూ ఫుల్ బిజీగా మారింది అనసూయ.

ఐకానిక్​ స్టార్ అల్లు అర్జున్​ పాన్​ ఇండియా చిత్రం 'పుష్ప: ది రైజ్​'లో దాక్షాయణిగా ప్రేక్షకులలో తనదైన ముద్రను వేసుకన్న అనసూయ.. ఆ చిత్రంలో సునీల్ భార్యగా ఉంటూనే తన తమ్ముడిపై ప్రతీకారం తీర్చుకోవాలని ఏకంగా తన భర్తపైనే దాడి చేసిన తీరు అద్భుతం. ఆ తరువాత రవితేజ ఖిలాడీ మూవీలో రెండు వేరియేషన్స్‌ ఉన్న పాత్రలో నటించి మెప్పించింది. తాజాగా సునీల్ పోలీసు అధికారిగా నటిస్తున్న చిత్రం 'దర్జా'లో అమె ప్రతినాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో సునీల్ కు తన సత్తా ఏంటో చాటలాని చూస్తున్న ఖల్ నాయికగా, అనసూయ కనకమహాలక్ష్మి పాత్రలో ఇమిడిపోయింది. ఈ చిత్రానికి సలీమ్‌ మాలిక్‌ దర్శకత్వం వహించారు.  

ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను నిర్మాత దగ్గుబాటి సురేష్‌ బాబు విడుదల చేశారు. ‘‘దర్జా’ టీజర్‌ బాగుంది. ఆడియన్స్‌ను ఈ సినిమా ఎంటర్‌టైన్‌ చేసేలా ఉంటుందనిపిస్తోంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి’’ అని నిర్మాత డి.సురేష్‌బాబు అన్నారు. ‘ఈ బండి కనకమహాలక్ష్మిది. సరకు మీద చేయి పడితే చావు చూపిస్తది’, ‘ఎవరైనా ఈ కనకాన్ని టచ్‌ చేయాలని చూశారా.. బందరు కోట బద్దలైపోద్ది’ అనే డైలాగ్స్‌ ఆకట్టుకుంటున్నాయి. ఈ టీజర్‌ లాంచ్‌ వేడుకలో ఏపీ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, ఏపీ అక్వా అసోసియేషన్‌ చైర్మన్‌ భూమాల శ్రీరామ్‌ మూర్తితో పాటు చిత్రయూనిట్‌ పాల్గొంది. ఈ సినిమాను కామినేని శ్రీనివాస్‌ సమర్పణలో శివశంకర్‌ పైడిపాటి నిర్మించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles