‘హ్యపీ డేస్’, ‘కొత్తబంగారు లోకం’ వంటి వరుస విజయాలతో టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్ సందేశ్. కానీ అదే జోష్‌ను తరువాత సినిమాల్లో కంటిన్యూ చేయలేకపోయాడు. ఈ చిత్రాల తరువాత ఆయన నటించిన సినిమాలు యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి. ఆ తరువాత వరుస ఫ్లాప్‌లు వెంటాడటంతో మధ్యలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించాడు. కానీ అవి కూడా వరుణ్ కెరీర్‌కు పెద్దగా ప్లస్ కాలేదు. దాంతో ఎక్కడ పడేసుకున్నాడో అక్కడే వెతకాలని నిర్ణయించుకున్నాడు.
టాలీవుడ్ లోకి తిరిగి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే రీ ఎంట్రీ సినిమా ‘ఇందువదన’ కూడా ఫ్లాప్‌గా మిగిలింది. ఇది కూడా వరుణ్ కు నిరాశనే మిగిల్చింది. దీంతో వరుణ్ సందేశ్ ఈ సారి రూటు మార్చి.. విభిన్న కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. తాజాగా ఈయన కొత్త సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. రమేష్ జక్కాల దర్శకత్వంలో వరుణ్ సందేశ్ ‘యద్భావం తద్భవతి’ అనే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్నాడు.
ఇక ఇవాళ వరుణ్ బర్త్‌డే సందర్భంగా మేకర్స్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. లేటెస్ట్గా విడుదలైన పోస్టర్లో వరుణ్ కళ్ళకు కూలింగ్ గ్లాసెస్ ధరించి నోట్లో సిగరెట్ కాల్చూతూ.. చేతి సంకెళ్ళను తెంచుకుని గన్‌తో ఫైరింగ్ చేస్తున్నాడు. ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. ఇక ఈ సారి సరికొత్త క్యారెక్టర్‌తో వరుణ్ ప్రేక్షకులు ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది. దీనితో పాటు సందీప్ కిషన్-విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మైఖేల్ సినిమాలో వరుణ్ సందేశ్ కీలకపాత్రలో నటిస్తున్నాడు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more