Noted OTT platform bought the rights of Bimbisara ఓటీటీలో ‘బింబిసారా’ విడుదల తేదీ అప్పుడే..

Bimbisara movie ott release date and platform fixed

Bimbisara, Nandamuri Kalyan Ram, Warina Hussain, Samyuktha Menon, Catherine Tresa, Bimbisara OTT Release, Bimbisara OTT Platform, OTT Release, OTT Platform, Mallidi Vashist, Hari Krishna, NTR Arts, Tollywood, movies, Entertainment

Socio-fantasy drama Bimbisara by Nandamuri Kalyan Ram, directed by Mallidi Vashist, generated positive word-of-mouth. In this case, the breaking news is that the movie's creators have established agreements with the OTT service ZEE5 in line with fashion.

కళ్యాణ్ రామ్ ‘బింబిసారా’ ఓటిటీ హక్కులు దక్కించుకున్న ఫ్లాట్ ఫామ్

Posted: 08/23/2022 07:55 PM IST
Bimbisara movie ott release date and platform fixed

కల్యాణ్ రామ్ హీరోగా రూపొందిన 'బింబిసార' ఈ నెల 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మంచి వసూళ్లు రాబడుతున్న విషయం తెలిసిందే. నూతన దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించిన ఈ సినిమా, తొలిరోజునే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అటు మరో ప్రతిష్టాత్మక చిత్రం 'సీతా రామం' అదే రోజున విడుదల కాగా, పోటీని తట్టుకుని తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజునే ఏకంగా రూ.6.3 కోట్లను రాబట్టింది. ఇక ఆ తరువాత వచ్చిన 'కార్తికేయ 2' కూడా ఈ చిత్రానికి గట్టి పోటీని ఇచ్చింది. అయినా తట్టుకుని విజయవంతంగా ఆడుతున్న ఈ సినిమా లాభాలను ఆర్జిస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లోనే సుమారు 50 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టిన ఈ చిత్రం.. కర్నాటక సహా దేశవ్యాప్తంగా రూ.2.22 కోట్ల వసూళ్లను రాబట్టగా.. ఓవర్ సీస్ లో రూ.2.30 కోట్ల వసూళ్లును రాబట్టింది. ఇప్పటికీ ఇంకా ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. కాగా, ఈ చిత్రానికి సంబంధించిన ఓ అప్ డేట్ తాజాగా చిత్రపురిలో చక్కర్లు కోడుతోంది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను 'జీ 5' సొంతం చేసుకున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. అయితే హక్కులను జీ్5 దక్కించుకున్నా.. ఇటీవల టాలీవుడ్  ప్రోడ్యూసర్ కౌన్సిల్, పెట్టుకున్న నిబంధనల ప్రకారం 50 రోజుల తరువాతే ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

ఇక ఈ చిత్రాన్ని మళ్లీ చూడాలని వేచి చూసేవారు.. ఓటీటీలో ఈ సినిమా ఎప్పుడు వస్తుందా.? మళ్లీ ఈ చిత్రాన్ని ఎప్పుడు చూద్దామా అని ఎదురుచూసేవారు మరో నెల రోజుల పాటు వేచివుండాల్సిందే. ఇక ఈ కథ రెండు వేర్వేరు కాలాల్లో జరుగుతుంది. రెండు కాలాల్లో ఒక నిధిని ఒకే సమయంలో తెరవడానికి జరిగే ప్రయత్నమే ఈ సినిమాకి హైలైట్. పాటల పరంగా ఈ సినిమా కాస్త వీక్ అయినప్పటికీ, కథాకథనాల పరంగా .. విజువల్స్ పరంగా లాక్కొచ్చేసింది. త్వరలోనే ఈ సినిమాను హిందీలో రిలీజ్ చేసే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles