మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఆయన నటించిన తొలి చిత్రం ఆచార్య ప్రేక్షకుల అంచనాలతో పాటు మెగా అభిమానుల అంచనాలను కూడా బాగా దెబ్బతీసింది. ఈ క్రమంలో చిరు తన తదుపరి చిత్రాలపై పూర్తి దృష్టిని పెట్టాడు. ప్రస్తుతం చిరు రెండు సినిమాల షూటింగ్ ఏకకాలంలో జరుపుతూ యువ హీరోలకు పోటీని ఇస్తున్నాడు. అందులో బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య ఒకటి. యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపకుంటుంది.
కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా హైదరాబాద్‌లో ఈ సినిమాకు సంబంధించిన భారీ షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ ఎపిసోడ్లో కీలక ఘట్టాలను తెరకెక్కించనున్నారని చిత్రపురిలో వార్తలు వినబడుతున్నాయి. ఈ షెడ్యూల్లో రవితేజ కూడా పాల్గొననున్నాడని సమాచారం. కాగా ఇటీవలే దర్శకుడు బాబీ తండ్రి మరణించిన విషయం తెలిసిందే. అయితే షూటింగ్ తన వల్ల ఆగిపోవద్దనే ఉద్దేశంతో బాబీ కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించడం గొప్ప విషయం అనే చెప్పాలి.
ఈ చిత్రం ‘ముఠా మేస్త్రీ’ తరహా మాస్ యాంగిల్లో అటు మాస్ తో పాటు ఇటు క్లాస్ ఆడియన్స్ ను కూడా నచ్చేట్టుగా కథను, కథనాన్ని దర్శకుడు బాబి రూపోందించుకున్నారు. ఇక ఇప్పటికే అందుతున్న లీకులకు తోడు ఈ చిత్ర పోస్టర్లను చూసినా.. ఈ విషయం ఇట్టే అర్థమైపోతోంది. చిరు ఈ సినిమాలో అండర్ కవర్ కాప్‌గా కనిపించనున్నాడు. విశాఖపట్నం నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుంది. మాస్రాజ రవితేజ కీలకపాత్రలో నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం మెగాస్టార్‌కు 154వ సినిమాగా తెరకెక్కుతుంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more