వెండితెరపై రారాజుగా వెలిగిపోతూ.. అదే సమయంలో ఇటు రాజకీయ రంగంలోనూ రాణించి కేంద్రమంత్రి స్థాయికి ఎదిగి.. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు పేరును తెలుగు ప్రజలకు సుపరిచితం చేసిన ఉప్పలపాటి కృష్ణంరాజు మరణవార్తను ఆ గ్రామస్తులు జీర్ణించుకోలేకపోయారు. కృష్ణంరాజుతో తమ చిన్నతనంలో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న కొందరు ఆయన మరణవార్తతో కన్నీటి పర్యంతమయ్యారు. 1940 జనవరి 20న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో కృష్ణంరాజు జన్మించారు. తండ్రి ఉప్పలపాటి వీరవెంకట సత్యనారాయణరాజు రైతు. తల్లి లక్ష్మీనర్సాయమ్మ గృహిణి.
కృష్ణంరాజుకు ఇద్దరు అక్కలు, నలుగురు చెల్లెళ్లు, ఒక తమ్ముడు. మొదటి భార్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా.. శ్యామలాదేవిని ద్వితీయ వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు కుమార్తెలు ప్రసీద, ప్రకీర్తి, ప్రదీప్తి సంతానం. ఆయన సోదరుడు ఉప్పలపాటి సూర్యనారాయణరాజు కుమారుడే ప్రముఖ కథానాయకుడు ప్రభాస్. కృష్ణంరాజు ఆరో తరగతి వరకు మొగల్తూరులో చదివారు. నరసాపురంలోని టేలరు ఉన్నత పాఠశాలలో ఎస్ఎస్ఎల్సీ, వైఎన్ కళాశాలలో పీయూసీ, హైదరాబాద్‌లోని బద్రుకా కళాశాలలో బీకాం పూర్తిచేశారు. డిగ్రీ చదివే సమయంలోనే అబిడ్స్‌లో ఓ స్టూడియో నిర్వహించేవారు.
ఆతర్వాత గాంధేయవాది పత్తేపురం మూర్తిరాజు నడిపిన ‘రత్నప్రభ’ దినపత్రిక నిర్వహణ బాధ్యతలు చూశారు. మూర్తిరాజుకు చెందిన కొల్లేరు ఫుడ్ ప్రొడక్ట్స్‌కు హైదరాబాద్‌లో ఉన్న ప్రధాన కార్యాలయంలో మేనేజర్‌గా పనిచేశారు. సినిమాలపై మక్కువతో మద్రాసుకు పయనమయ్యారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని ద్వారపూడి - కడియం గ్రామాల మధ్య ఉన్న జి.యర్రంపాలెం నుంచి సుమారు వందేళ్ల కిందట కృష్ణంరాజు పూర్వీకులు మొగల్తూరు వెళ్లి స్థిరపడ్డారు. అక్కడి రాజబహుదూర్ కోట సంస్థానానికి చెందిన రాజులతో కృష్ణంరాజు కుటుంబానికి ముందు తరం నుంచీ బంధుత్వం ఉంది. ఆ సంస్థానానికి చెందిన దత్తుడు రాజు మొగల్తూరు సర్పంచిగా ఉండే సమయంలో కృష్ణంరాజు కొంతకాలం ఆయనకు సహాయకుడిగా ఉన్నారు.
సినీ ప్రముఖులు సూపర్ స్టార్ కృష్ణ, సినీ నిర్మాత, నటుడు మురళీమోహన్, మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మంచు మోహన్‌బాబు, విక్టరీ వెంకటేష్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, నిన్నటి తర హీరో సుమన్, ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్, రాజుసుందరం, బీవీఎస్ ప్రసాద్ తదితరులు కృష్ణంరాజు ఇంటికి చేరుకొని నివాళులర్పించారు.
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, రఘురామకృష్ణరాజు, మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు, బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కాంగ్రెస్ నేత హనుమంతరావు, నివాళులర్పించారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, బీజేపి ఎంపీ కె.లక్ష్మణ్, తెలంగాణ మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి, ఎమ్మెల్సీ కవిత, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని, మాజీ మంత్రి డీకే సమరసింహారెడ్డి తదితరులు వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more