తెలంగాణ కోసం నిర్విరామంగా పాటుపడుతూ 4 కోట్ల తెలంగాణ ప్రజలను ఏకతాటి పైకి తెచ్చిన కే. చంద్రశేఖర్ రావు ఉద్యమం ముసుగులో ఉండి డబ్బులు సంపాదిస్తున్నాడా ? తెర వెనుక వేరే పార్టీ నాయకులకు అమ్ముడు పోతున్నాడా ? అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. కేసీఆర్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి అమ్ముడు పోయాడని, వారిద్దరు తెర వెనుక ఒక్కటయ్యారని అంటున్నారు.
ఈ విషయాలు ఎప్పటి నుండో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే తాజాగా అవిశ్వాసం జరిగిన నేపథ్యంలో మళ్ళి ఈ పుకార్లకు తెరలేచింది. ఈ వ్యవహారంపై వివిధ పత్రికలలో కథనాలు ప్రచురితం కాగా, తాజాగా ప్రజారా జ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి స్వయంగా ఈ వ్యాఖ్యలు చేయటంతో వదంతులకు రాజకీయ ప్రాధాన్యం లభించింది. సర్కార్‌ను ఎలాగైనా పడగొట్టాలన్న పట్టుదల, తెలంగాణలో పట్టు కోసం చేసే ప్రయత్నాలలో భాగంగా జగన్ ఏకంగా టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలనే లక్ష్యంగా చేసుకుని వ్యూహ రచన చేసినట్టు చెబుతున్నారు.
వ్యూహం ప్రకారం అవిశ్వాస తీర్మానాన్ని ఎలాగైనా నెగ్గేలా చేసేందుకు జగన్ చాలా కష్టడ్డాడని, ఆయన తెర వెనుక చాలా ప్రయత్నాలే చేశాడని, ప్రభుత్వాన్ని పడగొట్టడానికి తన ఎమ్మెల్యేల బలం సరిపోదని భావించిన జగన్ టి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సన్నిహితంగా ఉండి ఇందుకు ఉపయోగించుకోవాలనుకున్నారు. ఒకవేళ టీ కాంగ్రెస్ ఎమ్మె ల్యేలు విప్‌ను ధిక్కరించి సర్కార్‌ను కూలదోసేందుకు సహకరిస్తే... ఒకవేళ అనర్హత వేటుకు గురైనా వారందరికీ ఆయా స్థానాలలో టీఆర్‌ఎస్ టికెట్లు వచ్చేలా చేస్తానని, అప్పుడు టీఆర్‌ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్ రెండూ రంగం లోకి దిగి విస్తృత ప్రచారం చేసి మళ్ళీ వారంతా ఎమ్మెల్యే లుగా గెలిచేందుకు సహకరిస్తానని జగన్ రాయబారం పంపాడని అంటున్నారు టీడీపీ వారు. జగన్ అమలు చేయదలచిన ఈ వ్యూహం అటు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కూ సమ్మతంగానే ఉందంటు న్నారు.
ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి మళ్ళీ ఉప ఎన్నికలలో వారిని గెలిపించి క్రమేపీ శాసనసభలో బలం పెంచుకోవాలన్న ఆలోచనతో ఉన్న కేసీఆర్‌కు ఒకవేళ టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పార్టీవైపు మళ్ళితే కలిగేది లాభమే తప్ప నష్టం లేదు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటి సంగతి ఎలా ఉన్నా సభలో టీడీపీ తర్వాత అతి పెద్ద పార్టీగా అవతరించి అధికార పక్షాన్ని అడుగడుగునా ఇరుకున పెట్టవచ్చునన్న ఆలోచనతో కేసీఆర్ సైతం జగన్ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అయితే జగన్ ప్రయత్నం సఫలం కాకపోవటం తో ప్రస్తుతానికి టీఆర్‌ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్ మధ్య సత్సంబంధాలకే పరిమితం కావాలన్న ఆలోచనతో ఇద్దరు నాయకులూ ఉన్నట్టు చెబుతున్నారు.
మొత్తానికి కేసీఆర్, జగన్ లు కలిసి ప్రజలను మోసం చేస్తున్నారని ఏదో ఒక వీరు బయట పడక తప్పదని అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more