కేంద్ర హోంమంత్రి , కాంగ్రెస్ అధిష్టానంలో కీలక వ్యక్తి అయిన చిదంబరం కోర్టు బోను ఎక్కి జైలు ఊచలు లెక్కబెట్టబోతున్నాడా ? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. దేశంలోనే అతి పెద్ద స్కాం గా చెప్పబడుతున్న 2జీ ఉచ్చులో చిదంబరం చిక్కుకున్నాడా ? దానికి పకడ్బంది ఆధాలు ఉన్నాయా ? దీంతో చిదంబరం చిక్కుల్లో నుండి తప్పించుకోలేక ఉచ్చులో చిక్కుకున్నాడని, త్వరలోనే జైలు ఊచలు లెక్కబెట్టబోతున్నాడని అంటున్నాయి రాజకీయ వర్గాలు.
2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో చిదంబరం పై సుబ్రహ్మణ్య స్వామి పైచేయి సాధించారు. ఈ కేసులో తన సాక్ష్యాన్ని తీసుకోవలసిందిగా సుబ్రహ్మణ్యస్వామి అభ్యర్ధనను చివరకు సిబిఐ కో ర్టు మన్నించింది.. ఇది చిదంబరానికి పెద్ద దెబ్బ.
యుపిఎ ప్రభుత్వంలో అత్యంత కీలకమైన నాయకుడి గా వ్యవహరిస్తున్న చిదంబరం బోన్ ఎక్కే పరిస్థితే వస్తే అది ఎక్క డికి దారి తీస్తుందోనని కాంగ్రెస్‌లో గుబులు మొదలైంది. ఇప్పటికే సభలో చిదంబరాన్ని బాయ్‌కాట్ చేస్తున్న ప్రతిపక్ష ఎన్డీయే తమ నిర్ణయానికి కారణమిదేనంటూ స్పష్టం చేసింది. కోర్టు అలా స్వామి అభ్యర్ధనను మన్నించడమేమిటి తక్షణమే ప్రతిపక్షా లు ఆయన తన పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేయడం జరిగిపోయాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాల లో 11వ రోజున ఈ వ్యవహారంపై గందరగోళం చెలరేగింది.
2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసు మూలాల్లోకి వెళ్ళేందుకు ఫిర్యాదుదారు అయిన జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్య స్వామి సాక్షిగానే కాక తన వాదన తానే ఈనెల 17వ తేదీన వినిపించేందుకు సిబిఐ కోర్టు గురువారం అనుమతించిన విషయం తెలిసిందే. 2జి స్పెక్ట్రమ్ ధరలను నిర్ణయించేటప్పుడు టెలికం మాజీ మంత్రి, చిదంబరం సం యుక్తంగా నిర్ణయం తీసుకున్నారని రుజువు చేసేందుకు తన ను, కొందరు సిబిఐ అధికారులను, మరికొందరిని తిరిగి విచారించేందుకు అనుమతించవలసిందిగా స్వామి చేసిన విజ్ఞప్తిపై డిసెంబర్ 3వ తేదీన కోర్టు తన ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. పైగా నాడు ఆర్థిక మంత్రిగా చిదంబరం లైసెన్సులు పొందిన స్వాన్ టెలికం, యునిటెక్ కంపెనీలు విదేశీ కంపెనీలకు షేర్లు అమ్ముకునేందుకు అనుమతించారని కూడా స్వా మి ఆరోపించారు.
ఈ నేపథ్యంలో చిదంబరం కోర్టు బోను ఎక్కితే కాంగ్రెస్ పరిస్థితి ఏంటని అందరు అనుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more