నారా చంద్రబాబు నాయుడు అంటే తెలియని వారు ఎవరు ఉండరు. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందజేసిన సైకిల్ ఆయనే ఇచ్చాడని తెలుసట కానీ చంద్రబాబు తెలియదట నారాకి. అన్నట్లు నారా అంటే ఎవరు అనుకుంటున్నారు కదూ.
తెలంగాణ జిల్లాల్లో రైతు పోరుబాటలో జరిగిన అరుదైన సంఘటన ఇది. అసలు విషయం ఏంటంటే....పై ఫోటోలో ఇటవైపు ఉన్నది మాజీ ముఖ్యమంత్రి నారా వారు.... అటువైపు ఉన్నది గీతకార్మికుడు నారా గౌడ్. ఇద్దరికీ అడ్డు సైకిలే. వారిద్దరి మధ్యా బంధం కూడా ఆ సైకిలే. చంద్రబాబు హయాంలో ఆదరణ పథకం కింద నారా గౌడ్ కి అధికారులు ఓ సైకిల్ ఇచ్చారు. దాన్ని ఇచ్చింది చంద్రబాబు అని తెలుసు కానీ... ఆయన ఎలా ఉంటారో నారాగౌడ్ కి తెలియకపోవడంతో ఇక్కడ ఓ తమాషా చోటు చేసుకుంది.
నిజామాబాద్ జిల్లా కొలిప్యాక్ నుంచి మనోహరాబాద్ వరకు చంద్రబాబు రైతుపోరు బాట సాగిస్తుండగా... నారాగౌడ్ ఎదురయ్యారు. అతణ్ని ఆపిన బాబు... గీత పని ఎలా వుందని వాకబు చేశారు. గతంలో ఆదరణ పథకం కింద సైకిళ్ళు ఇచ్చామని, ప్రస్తుత ప్రభుత్వం ఏమైనా ఇచ్చిందా అని బాబు గారు అడగ్గా.... ‘‘ చంద్రబాబు ఉండగా సైకిళ్ళు ఇచ్చారు, ఇప్పటి ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదు. చంద్రబాబే కొంత నయం అని’’ వ్యాఖ్యానించాడు. ప్రక్కనే ఉన్న ఎమ్మెల్యేలు ఈయనే చంద్రబాబు అని చెప్పడంతో.... ‘‘నిజమా... నువ్వు చంద్రబాబువా’’ అని నారాగౌడ్ ఆశ్చర్యపోయారు.
ఈ సంఘటనతో బాబుకు కొంత సేపు ఎటూ పాలు పోలేదు. ఇటు మంచిగా చెప్పినందుకు ఆనందించాలో, లేక నేనే తెలియకపోవడమా అని తలదించుకోవాలో ఆయనకు ఆ సమయంలో తెలియలేదని అనుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more