వ్యాపార రంగంలో తన తడాఖా చూపిస్తుంది చందా కొచర్ ప్రైవేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ ... డిసెంబర్ క్వార్టర్(క్యూ3)కు ఆకర్షణీయ ఫలితాలను సాధించిందట. అక్టోబర్-డిసెంబర్’11 కాలానికి రూ. 1,728 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. స్టాండ్ ఎలోన్ ప్రాతిపదికన ఒక క్వార్టర్‌కు బ్యాంక్ చరిత్రలోనే ఇది అత్యధిక లాభం! అంతక్రితం ఇదే క్వార్టర్‌లో నమోదైన రూ. 1,437 కోట్లతో పోలిస్తే ఇది 20% వృద్ధి. కాగా, ఇదే కాలానికి బ్యాంక్ ఆదాయం కూడా రూ. 8,445 కోట్ల నుంచి రూ. 10,484 కోట్లకు జంప్ చేసింది. ఈ కాలంలో ప్రొవిజన్లు రూ. 464.3 కోట్ల నుంచి రూ. 341.1 కోట్లకు తగ్గగా, నిరర్థక ఆస్తులు 1.16% నుంచి 0.7%కు దిగివచ్చాయి. బ్యాంక్ సీఏఆర్ 18.88%గా నమోదైంది. దీంతో బీఎస్‌ఈలో షేరు ధర దాదాపు 6% దూసుకెళ్లి రూ.902 వద్ద ముగిసింది.
కన్సాలిడేటెడ్ లాభంలోనూ వృద్ధి
డిసెంబర్ క్వార్టర్‌కు అనుబంధ సంస్థలతో కలిపి కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఐసీఐసీఐ బ్యాంక్ రూ. 2,174.2 కోట్ల లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఇదే కాలంలో రూ.2,039.4 కోట్లను ఆర్జించింది. వడ్డీ ఆదాయం పుంజుకోవడంతోపాటు, ప్రొవిజన్లు తగ్గడంతో లాభాల్లో వృద్ధిని సాధించగలిగినట్లు బ్యాంక్ ఎండీ చందా కొచర్ మంగళవారం చెప్పారు. ప్రధానంగా కార్పొరేట్ రుణాల్లో నమోదైన 30% వృద్ధి మంచి ఫలితాలను సాధించేందుకు దోహదపడినట్లు తెలిపారు. అయితే రిటైల్ రుణాల జారీ 8% మాత్రమే పెరిగింది. లోయర్ బేస్ కారణంగా భవిష్యత్‌లో రిటైల్ రుణాల జారీ పుంజుకోనున్నట్లు కొచర్ తెలిపారు.
వడ్డీ ఆదాయం 17% ప్లస్
తాజా క్వార్టర్‌లో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 17% పుంజుకుని రూ. 2,712 కోట్లకు చేరింది. ఇందుకు 19% పెరిగిన రుణ మంజూరీ అండగా నిలిచింది. నికర వడ్డీ మార్జిన్లు (ఎన్‌ఐఎం) 2.7%కు చేరగా, ఫీజు ఆదాయం 5% పెరిగి రూ. 1,701 కోట్లయ్యింది. ఇక నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) 0.7%గా నమోదయ్యాయి. ప్రస్తుతం వడ్డీ రేట్లలో మార్పులు చేపట్టే ఆలోచనేమీ లేదని కొచర్ వెల్లడించారు. అనుబంధ కంపెనీలలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ నికర లాభం డిసెంబర్‌తో ముగిసిన 9 నెలలకు రెట్టింపునకుపైగా ఎగసి రూ. 1,056 కోట్లను తాకినట్లు తెలిపారు. ఇదే కాలంలో సాధారణ బీమా విభాగం 36% వృద్ధితో రూ. 101 కోట్ల లాభాన్ని ఆర్జించినట్లు తెలియజేశారు. కాగా, బ్యాంక్ బోర్డు... పిరమల్ గ్రూప్ డెరైక్టర్ స్వాతి పిరమల్‌ను నాన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా నియమించుకుంది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more