అది ఆటల సమయం కాకపోయినా స్కూల్లో పిల్లలు కొంతమంది ఆటలాడుతుంటే చూసిన టీచర్ వాళ్ళందరినీ పిలిచి కోప్పడుతున్నారు. అందులో ఒకడు, "సార్ నేను ఆడలేదు" అంటే సరిపోయేది కానీ, "నేను ఆడతానంటే వీళ్ళు చేర్చుకోలేదు సార్" అని అన్నాడట. "అంటే, చేర్చుకుంటే ఆడేవాడివేగా, వెధవ, పోయి వాళ్ళతో పాటు బయట నిలబడు" అన్నారట అన్నారట అప్పుడా టీచర్.
నిన్న తెదేపా కార్యదర్శి వర్ల రామయ్య ఎక్సైజ్ మంత్రి మోపిదేవి కుమారుడి పేరు మీద బీర్ వ్యాపారం గురించి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఈ రోజు మోపిదేవి సచివాలయంలో మాట్లాడుతూ, తన కుమారుడు రాజీవ్ పేరుతో బీర్ కంపెనీ కోసం రిజిస్టర్ చేసిన మాట వాస్తవమే కానీ వాటికింతవరకూ అనుమతులు రాలేదని అన్నారు. వ్యాపారం కోసం రిజిస్టర్ చేసుకుని ఆ తర్వాత విరమించుకున్నా దాన్ని విమర్శించటం బాగోలేదన్నారు మోపిదేవి. బాధ్యతాయుతమైన పదవిలో ఉండబట్టే ఆ వ్యాపారం తగదని విరమించుకున్నానని కూడా మోపిదేవి అన్నారు. విరమించుకోబట్టి అనుమతులు రాలేదో లేకపోతే అనుమతులు రాక విరమించుకున్నారన్నదానిలో మోపిదేవి మాటల్లో స్పష్టత లేదు.
వ్రతం చెడిందీ ఫలితమూ దక్కలేదన్నట్టు, వ్యాపారానికి కావలసిన అనుమతులూ రాలేదు, ఇప్పుడేమో దాని మీద విమర్శలను ఎదుర్కుంటున్న మోపిదేవి వేదాంత ధోరణిలో, ఎక్సైజ్ శాఖను చూసేవారిమీద ఆరోపణలు రావటం సహజమేనని అన్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more